Solar Kitchen: కరెంట్ వాడరు, గ్యాస్ వెలిగించరు..కానీ రోజూ 50వేల మందికి భోజనం, ఇదెలా సాధ్యం?

Published : Mar 23, 2026, 09:10 PM IST

Solar Kitchen: సౌకర్యాలు పెరగడంతో పాటే ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దాంతో పాటే గ్యాస్, కరెంట్ వంటివి ఖరీదవుతున్నాయి. ఈ క్రమంలో ఖర్చులు తగ్గిస్తూ వేలమందికి వంట చేసేందుకు తెచ్చిన వినూత్న పరిష్కారం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. 

PREV
17
సౌరశక్తితో నడిచే అతిపెద్ద సోలార్ కిచెన్

ఇప్పుడంతా టెక్నలాజికల్ ప్రపంచం. ప్రతి విషయంలోనూ ఇన్నోవేటివ్‍గా ముందుకెళ్తున్నారు. అందుకే కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లు తయారైంది. మనుషులు కూడా సుఖాలకు, సౌకర్యాలకు అలవాటు పడిపోయారు. ఏ చిన్న సమస్య వచ్చినా దానికి ప్రత్యమ్నాయం ఆలోచించడం మానేసి...అల్లాడిపోతున్నారు అయితే ప్రెజెంట్ గ్యాస్ సిలిండర్ల సమస్య కారణంగా...ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది మాత్రం పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ కట్టెలపొయ్యిని వాడటం మొదలుపెట్టారు.

ఇక్కడొక విషయం మనం గుర్తించాలి. మనిషి జీవితంలో సౌకర్యాలు పెరగడంతో పాటే ఇంధన వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. దానివల్ల వాతావరణంలో విపరీతమైన పొల్యూషన్ చేరుతోంది. దీంతో గాలిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతోంది. ముఖ్యంగా వంటకు ఉపయోగించే గ్యాస్, కరెంట్ వంటివి ఖరీదవుతున్నాయి. మరోవైపు పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ క్రమంలో అటు ప్రకృతిని కాపాడుతూ ఖర్చులను తగ్గిస్తూ వేల మందికి వంట చేసేందుకు తీసుకొచ్చిన ఒక అద్భుత పరిష్కారం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అదే పూర్తిగా సౌరశక్తితో నడిచే అతిపెద్ద సోలార్ కిచెన్.

27
ఎక్కడా కనిపించని కరెంట్ పొయ్యిలు, గ్యాస్ స్టవ్‍లు గానీ

ఈ సోలార్ కిచెన్ సాధారణ వంటగదిలా కాదు. ఇది టెక్నాలజీ, సేవాభావం, పర్యావరణ పరిరక్షణ అనే 3 అంశాల కలయిక. ఈ సోలార్ కిచెన్‍లో 50 వేల మంది కోసం వంట చేస్తారు. కానీ ఎక్కడా కరెంట్ పొయ్యిలు గానీ గ్యాస్ స్టవ్‍లు గానీ కనిపించవు. దానికి బదులుగా భారీ పరిమాణంలో అమర్చిన సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఇవి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను సేకరించి అధిక ఉష్ణాన్ని అందిస్తాయి. ఈ ఉష్ణాన్నే వంటకు వినియోగిస్తారు. కేవలం ఉష్ణంతోనే వంట చేయడమన్నది మామూలు విషయం కాదు. కానీ ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు...బ్రహ్మకుమారీస్ సంస్థ. 

37
రాజస్థాన్‌లోని మౌంట్ అబూ వద్ద ఉన్న బ్రహ్మ కుమారీస్ 'శాంతివన్ సోలార్ కిచెన్

ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ కిచెన్లలో ఒకటి. దీని ద్వారా రోజుకు సుమారు 50,000 మందికి పైగా భోజనం అందిస్తున్నారు. ఇది పూర్తిగా సోలార్ ఎనర్జీని ఉపయోగించి ఆ వచ్చే ఆవిరి ద్వారా వంట చేస్తున్నారు. కేవలం ఉష్ణంతోనే అన్నం, పప్పులు, కూరలు, చపాతీ వంటి వంటకాలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ పొల్యుషన్ లేని ప్రధాన ఇంధన వనరు సూర్యుడే.

47
ఈ 'శాంతివన్ సోలార్ కిచెన్' ప్రత్యేకత

రోజుకు వేల మందికి భోజనం సిద్ధం చేయగల సామర్థ్యం ఉంది. రోజుకు దాదాపు 40 వేల నుండి 50 వేల మందికి పైగా ఇక్కడ వంట చేస్తారు. చాలా ఆశ్రమాల్లో కూడా వంట కోసం గ్యాస్, కరెంట్ పొయ్యిలనే వాడతారు. గ్యాస్, కరెంట్ అయితే వంటలు త్వరగా అయిపోతాయి. సోలార్ కిచెన్ ద్వారా వంటలు ఆలస్యమైనా కానీ కానీ ఇంత భారీ స్థాయిలో వంట చేయడం కోసం గ్యాస్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం..ఈ వ్యవస్థ విజయమనే చెప్పాలి. భారీ పాత్రలు, ఆవిరి ఆధారిత వంట విధానం, సమన్వయంతో పనిచేసే సిబ్బంది ఉన్నారు.

ఇక్కడ వంట చేసే విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఉదయం సూర్యుడు ఉదయించగానే సోలార్ డిష్‌లు కూడా పొద్దుతిరుగుడు లాగానే సూర్యుడి దిశలోకి తిరుగుతాయి. సూర్యకాంతిని సేకరించి, అదంతా ఒకచోటకు చేర్చడంతో ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఆ ఉష్ణంతో నీరు మరిగి ఆవిరిగా మారి, ఆ ఆవిరిని పైపుల ద్వారా వంట పాత్రల వరకు తీసుకెళ్లి దాంతో వంటను పూర్తిచేస్తారంట. ఈ విధానం వల్ల ఇంధన వినియోగం ఉండదు, అంతేకాదు హెల్దీ భోజనం సిద్ధమవుతుంది.

57
రోజుకు దాదాపు 40 వేల నుండి 50 వేల మందికి భోజనం

అంతేకాదు ఈ సోలార్ కిచెన్ పర్యావరణానికి ఎంటి హానికారకం కాదు.గ్యాస్ లేదా బొగ్గు ఉపయోగిస్తే కార్బన్ డయాక్సైడ్ వంటి హానికర వాయువులు వాతావరణంలోకి విడుదలై వంట చేసేవారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందులోనూ ఇంతమందికి వంట చేయాలంటే కచ్చితంగా రోజంతా ఇందులోనే ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఇక్కడ అలాంటివి లేవు. సూర్యశక్తి ఉపయోగించడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. దీని వల్ల గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని కూడా చాలావరకు నియంత్రించవచ్చు.

ఆర్థిక పరంగా కూడా ఈ వ్యవస్థ చాలా లాభమే. మొదట్లో సోలార్ ప్యానెళ్లు, డిష్‌లు, ఇతర పరికరాల ఏర్పాటు కోసం కాస్త ఖర్చు అవుతుందే తప్ప, తరువాత నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. గ్యాస్, కరెంట్ బిల్ ఉండదు. దీనివల్ల దీర్ఘకాలంలో ఆదాయం ఆదా. ముఖ్యంగా పెద్ద పెద్ద ఆశ్రమాలు, దేవాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు వంటి చోట్ల ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది.

ఇక్కడ పనిచేసే సిబ్బంది పాత్ర చాలా ముఖ్యం. ఎందుకంటే సోలార్ కిచెన్‍లో వంట చేయడానికి అనుభవం, సమన్వయం అవసరం. పెద్ద పాత్రల్లో అన్నం ఉడికించడం, కూరలు తయారు చేయడం, సమయానికి వంట పూర్తిచేయడం ఇవన్నీ ఒక్కరివల్ల అయ్యే పని కాదు. అందుకే సమష్టి కృషి ఉంటుంది. సాంప్రదాయ వంట నైపుణ్యానికి ఆధునికత జోడిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు వస్తాయో ఈ వంటశాల నిరూపిస్తోంది.

67
చేయాత అందించాల్సిన సమయం

ఈ సోలార్ వంటశాల కేవలం ఒక విజనరీయే కాదు, ఉద్యమం. ఈ పొల్యూషన్ యుగంలోనూ ప్రకృతి ప్రసాదించే జీవితాన్ని గడపడం, సహజ వనరులను సరైన విధంగా వాడుకోవడం, భవిష్యత్తు తరాలకు మంచి ప్రపంచాన్ని అందించడం చాలా గొప్ప విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సోలార్ కిచెన్లు ఉన్నాయి గానీ ఈ స్థాయిలో పనిచేసే సోలార్ కిచెన్ చాలా అరుదు, ఎక్కడా కనిపించదు కూడా.

భవిష్యత్తులో ఇలాంటి సోలార్ కిచెన్లు విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ సమస్యల దృష్ట్యా ప్రత్యమ్నాయాలు ముందే పెట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలే చూడాల్సి వస్తుంది. ఈ సోలార్ కిచెన్ అనేది ఒక రెవెల్యూషన్ లాంటిది. దీన్ని అనుకూలంగా మార్చుకుంటే మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చు, స్కూళ్లు, కాలేజీల్లో కూడా ఈ సోలార్ కిచెన్లు వస్తే విద్యార్థులకు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించవచ్చు. అంతేకాకుండా ప్రమాదాల బారి నుంచి కాపాడవచ్చు. ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇలాంటి విధానాలను ప్రోత్సహిస్తే, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్ద మార్పు తీసుకురావచ్చు. సామాజిక సంస్థలు, పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థలు కూడా చేయూత అందించాల్సిన సమయమిది. 

77
ఇదేమీ కొత్త విషయం కాదు

సోలార్‍ పవర్ అనేది ఇప్పుడేమి కొత్త విషయం కాదు. ఏన్నో ఏళ్ల నుంచి సోలార్ పవర్ ద్వారా పంటలు పండిస్తున్నారు. ఇళ్లల్లోనూ సోలార్ పవర్‍ను ఉపయోగిస్తున్నారు. కాస్త ఇన్నోవేటివ్‍గా వంటలు కూడా మొదలు పెట్టారు. మన కళ్ల ముందు ఉన్న సూర్యుడినే ప్రతిరోజూ ఇచ్చే అపారమైన శక్తిని సరిగ్గా వినియోగిస్తే, మన అవసరాలను తీర్చుకోవడం మాత్రమే కాకుండా, ప్రకృతిని కూడా కాపాడుకోవచ్చు. గ్యాస్ లేకుండా, కరెంట్ లేకుండా, కేవలం సూర్యశక్తితో వేలాది మందికి ఆహారం అందించడం నిజంగా ఒక అద్భుతమనే చెప్పుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories