మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉందా? అయితే కూరగాయలను తినండి..

First Published | Nov 1, 2022, 4:07 PM IST

మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. దీనిద్వారే మన ఎముకలు బలంగా ఉంటాయి. అయితే ఈ విటమిన్ డి సూర్య రశ్మి ద్వారే కాదు.. కొన్ని రకాల ఆహారాల ద్వారా కూడా అందుతుంది. 
 

విటమిన్ డి లోపం చాలా మందిలో కనిపిస్తుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి మన శరీరంలో కాల్షియం శోషణకు సహాయపడుతుంది. దీంతో ఎముకలు, దంతాల ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇతర విటమిన్ల లాగే ఈ విటమిన్ డి ఒక్క ఆహారం ద్వారే కాదు.. సూర్యరశ్మి ద్వారా కూడా అందుతుంది. ప్రతిరోజూ ఉదయం ఒక అర్థగంట పాటు సూర్య రశ్మిలో నిలబడితే మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. ఈ సూర్యకిరణాలు మన చర్మంపై పడినప్పుడు ఎన్నో రసాయనిక చర్యలు జరుగుతాయి. దీంతో మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. మన లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు, మంచి ఆహారపు అలవాట్ల వల్ల విటమిన్ డి ని పొందొచ్చు. ఒకవేళ మీ శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉంటే ఈ కూరగాయలను రోజూ తినండి. 
 

బచ్చలికూర

బచ్చలికూరను తింటే కూడా విటమిన్ డి అందుతుంది. నిజానికి బచ్చలికూర విటమిన్ల భాండాగారం. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం వంటి అనేక భాగాలు ఉంటాయి. బచ్చలి కూరను తినడం వల్ల ఒక రోజుకు అవసరమైన విటమిన్ డి లో 25 శాతం అందుతుంది. అందుకే విటమిన్ డి లోపం ఉన్నవారు బచ్చలికూరను రోజూ తినాలి.
 


పుట్టగొడుగులు

పుట్టగొడుగులు విటమిన్ డి కి మంచి వనరు. వాటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పుట్టగొడుగులను తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఎలా అంటే వీటిని తింటే తొందరగా ఆకలి కాదు. ఫుడ్ కూడా తక్కువగా తింటారు. పుట్ట గొడుగులలో కనిపించే సెలీనియం అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పుట్టగొడుగుల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరానికి అవసరమైన ఇనుములో 90 శాతం పుట్టగొడుగుల నుంచి లభిస్తుంది.
 

సోయా బీన్స్

సోయా బీన్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ సోయా బీన్స్ లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది మీలో విటమిన్ డి లోపాన్ని పోగొడుతుంది. 
 

సీ ఫుడ్, ఫ్యాటీ ఫిష్ లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి ఉంటుంది. అంతేకాదు నాటు కోడి గుడ్లలో కూడా ఈ విటమిన్ ఉంటుంది. పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. గుడ్డులో కూడా ఇది ఉంటుంది. 
 

విటమిన్ డి వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఎముకలు బలంగా అవుతాయి. కండరాల నిర్మాణం కూడా బాగుంటుంది. దంతాలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. శరీరంలో ఇది లోపించడం వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. ఒంటి నొప్పులు వస్తాయి. తలనొప్పి వస్తుంది. ఈ విటమిన్ డి లోపం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పెద్దవారిలో విటమిన్ డి లోపం వల్ల ఎముకలు నొప్పి పెడతాయి. బలహీనంగా అవుతాయి. ఈ విటమిన్ డి ప్రతి ఒక్క ఏజ్ వారికి అవసరం. అందుకే ఈ విటమిన్ డి తక్కువ కాకుండా చూసుకోండి.        

Latest Videos

click me!