
ప్రతి ఏడాది ఆగస్టు 1 ని ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీసే కారకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కొన్ని రకాల ఆహరాలను ఎంతో సహాయపతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాల్మన్ ఫిష్ (Salmon fish)
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి విటమిన్ డి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం విటమిన్ డి ఎక్కువగా ఉండే సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ కొవ్వు చేపలను ఎక్కువగా తింటూ ఉండాలి. వీటిని తినడం వల్ల విటమిన్ డి లోపం పోతుంది. కానీ శరీరంలో విటమిన్ డి తగ్గితే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
బ్రోకలీ (Broccoli)
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజు వారి ఆహారంలో బ్రోకలీని చేర్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎంతో తగ్గుతుందట. బ్రోకలీలో ఉండే కొన్ని యాంటీఆక్సిడెంట్లు ఇందుకు సహాయపడతాయి. బ్రోకలీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
టమాటాలు (Tomatoes)
టమాటాలు కూడా ఊపిరితిత్తుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. టమాటాల్లో లైకోపీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.
క్యారెట్లు (Carrots)
క్యారెట్లలో క్లోరోజెనిక్ ఆమ్లం అని పిలువబడే ఫైటోకెమికల్ ఉంటుంది. క్యారెట్లను తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం 42% వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లలో విటమిన్ సి, బీటా కెరోటిన్, బీటా క్రిప్టోశాంథిన్, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పసుపు (Turmeric powder)
పసుపును ఆహారంలో పుష్కలంగా చేర్చుకోవచ్చు. పసుపులో ఉండే కర్కుమిన్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది దాని యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల ద్వారా సహాయపడుతుంది.
అల్లం (ginger)
అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి శ్వాసనాళ ఇన్ఫెక్షన్లను నిరోధించగలవని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
గ్రీన్ టీ (Green tea)
గ్రీన్ లో మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా సహాయపడుతుంది. దీన్ని తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు కనుగొన్నాయి.
బెర్రీలు (Berries)
బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీ, క్రాన్ బెర్రీలల్లో ఆంథోసైనిన్స్ అనే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఆంథోసైనిన్స్ రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిన వారిలో 3% నుంచి 15% మందికి రక్తం గడ్డకడుతుంది. ఈ వ్యాధి కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు.