మీ కాపురంలో శృంగారం ఉందా? లేకపోతే.. ఏ సమస్యలు వస్తాయో తెలుసా??

First Published | Jul 1, 2022, 11:18 AM IST

భార్యాభర్తల మధ్య మంచి అనుబంధానికి పునాది పడితే శృంగారం తోనే. వీరి మధ్య వచ్చే గొడవలకు చాలాసార్లు పరిష్కారం బెడ్రూంలోనే దొరుకుతుంటుంది. అలాంటిది.. ఆ శృంగారమే లోపిస్తే.. ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా.. 

కోపం పెరుగుతుంది
ఇద్దరి మధ్య శృంగారం లోపించడం వల్ల కోపం పెరుగుతుంది. ఒకరిమీద ఒకరు తీవ్రంగా అరుచుకుంటారు. ప్రతీచిన్న దానికి గొడవలు పడుతుంటారు. వాదనలకు దిగుతుంటారు.

sex

డిప్రెషన్
పడకగదిలో తూర్పూపడమరల్లా ఉండడం వల్ల.. డిప్రెషన్ లోకి వెడతారు. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అది జంటలోని ఇద్దరి మానసిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తుంది. 


Image: Getty Images

మాటలుండవు.. మాట్లాడుకోవడాలుండవు..
ఇద్దరి మధ్య శృంగారానుబంధం లోపించడంతో.. ఏ విషయం మీదైనా మాటలు,మాట్లాడుకోవడాలు ఉండదు. సంతోషమైనా, విషాదం అయినా తమతోనే ఉంచుకుంటారు. లేదంటే వేరేవారితో షేర్ చేసుకుంటారు. 

Image: Getty Images

శృంగారంలేని బంధం ఆత్మన్యూనతకు దారి తీస్తుంది. ముఖ్యంగా శృంగారం కోసం చొరవ చూపే భాగస్వామికి ఎదురుదెబ్బ తగిలినట్టవుతుంది. దీనివల్ల మీ బంధంలో ప్రస్టేషన్ మొదలవుతుంది. 

Image: Getty Images

మంచి నిద్ర కరువు
చక్కటి శృంగారం తరువాత.. హాయిగా నిద్రపోతారు. అయితే మీ కాపురంలో శృంగారం మిస్ అయితే మీకు నిద్రలేమి కలుగుతుంది. దీనివల్ల చాలా సమస్యలు కొనితెచ్చుకున్నట్టవుతుంది. 

Image: Getty Images

సోషల్ మీడియా... డేటింగ్ యాప్స్ మాయలో..
కాపురంలో శృంగారం లోపించడంతో పక్క చూపులు ఎక్కువవుతాయి. సోషల్ మీడియాలో అపరిచితుల వలలో పడే అవకాశాలుంటాయి. శారీరక వాంఛ తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కే అవకాశాలుంటాయి. 

వివాహేతర సంబంధాలు
కాపురంలో కలతలే అన్ని సమస్యలకు కారణాలవుతాయి. చక్కటి శృంగారం లోపించడం వల్ల దాన్ని వెతికే క్రమంలో వివాహేతర సంబంధాలవైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల తమ కాపురంతో పాటు ఎదుటివారి కాపురాలనూ పాడు చేస్తారు.

ఫోర్నోగ్రఫీకి అలవాటు పడతారు..
తమ శృంగార కోరికలు తీర్చుకోవడానికి ఫోర్నోగ్రఫీ మీద ఆదారపడతారు. దీనికి ఇలాగే అలవాటు పడితే.. ఇది వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. 

విడాకులు
చక్కటి అనుబంధానికి.. మంచి శృంగారం మార్గదర్శకంగా ఉంటుందనడంలో సందేహం లేదు. మరి అలాంటిది ఆ శృంగారమే లోపిస్తే.. మీ బంధం ప్రశ్నార్థకంగా మారుతుంది. అప్పుడే విడాకుల ఆలోచనలూ వస్తాయి. 

Latest Videos

click me!