world hepatitis day 2022 : హెపటైటిస్ ఉన్నవారు తినాల్సినవి.. తినకూడనివి ఇవే..

Published : Jul 28, 2022, 03:10 PM IST

world hepatitis day 2022 : హెపటైటిస్ సి సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉంటూ.. కొన్నింటిని రోజు వారి ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. అప్పుడే సమస్య నుంచి తొందరగా బయబటపడతారు. 

PREV
113
 world hepatitis day 2022 : హెపటైటిస్ ఉన్నవారు తినాల్సినవి.. తినకూడనివి ఇవే..
hepatitis c

ఈ రోజు  (జూలై 28) వరల్డ్ హెపటైటిస్ డే. హెపటైటిస్  అంటే కాలెయానికి సంబంధించిన వ్యాధి అని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా నేడు ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధిని గుర్తించడంలో జాప్యం జరగడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హెపటైటిస్ సి అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది కాలేయ వాపుకు కారణమవుతుంది. కొన్ని కొన్ని సార్లు ఇది తీవ్రమై కాలేయ నష్టానికి దారితీస్తుంది.

213

హెపటైటిస్ సి వైరస్ దీర్ఘకాలిక సంక్రామ్యతను క్రానిక్ హెపటైటిస్ సి అని అంటారు. దీర్ఘకాలిక హెపటైటిస్ సి సాధారణంగా ఏండ్లు గడిచినా బయటపడదు. అందుకే దీన్ని నిశ్శబ్ద సంక్రమణ అంటారు. లేకపోవడం, అలసిపోవడం, చర్మంపై దురద, బరువు తగ్గడం ఇవన్నీ హెపటైటిస్ సి వైరస్ లక్షణాలు.

313

హెపటైటిస్ సి ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారాలను తినాల్సి ఉంటుంది. పోషక విలువలు లేని ఆహార పదార్థాలను తినడం మానేయాలి. సరైన పోషణను నిర్వహించడం ద్వారా కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే హెపటైటిస్ సి ప్రభావం తగ్గుతుంది. 
 

413

బరువును ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. మీకు హెపటైటిస్ సి ఉంటే.. స్థూలకాయం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల హెపాటిక్ స్టీటోసిస్ వస్తుంది. ఇది హెపటైటిస్ సి ని నియంత్రించడం కష్టతరం చేస్తుంది.

513
hepatitis

హెపటైటిస్ సి ఉన్నవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే వీరు ఎప్పుడూ షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి.హెపటైటిస్ సి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ ను ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం..

613

తాజా పండ్లు, కూరగాయల్లో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి హెపటైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి.  అందుకే క్రమం తప్పకుండా 1 నుంచి 3 కప్పుల కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

713
protein rich foods

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తింటే కూడా మంచిది. హెపటైటిస్ సి సోకిన కాలేయ కణాలను మరమ్మతు చేయడానికి,  వాటిని భర్తీ చేయడానికి ప్రోటీన్ ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం చేపలు, గుడ్లు, సోయా ఉత్పత్తులను రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి.  అయితే ఈ ప్రోటీన్లు లింగం, వయసు, కార్యచరణపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 2 నుంచి 6 1/2 ఔన్సుల ప్రోటీన్ ను తీసుకుంటే సరిపోతుంది.

813

పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

913

గ్రీన్ టీ లో ఉండే ఫినోలిక్ కాటెచిన్లు, బ్లూబెర్రీ ఆకుల్లో ఉండే ఒలిగోమెరిక్ ప్రోఆంథోసైనిడిన్ హెపటైటిస్ సి లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి.
 

1013

వీటిని తినకూడదు

వీళ్లు సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల శరీరంలో నీరు అలాగే ఉంటుంది. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. సిర్రోసిస్ ఉన్నవారికి ఇది ప్రమాదకరం.

1113

ప్రాసెస్ చేసిన ఆహారాలను తినే అలవాటును పూర్తిగా మానుకోవాలి. ఎందుకంటే ఇది ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. 

1213

జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఆయిల్,క్యాన్డ్ ఫుడ్స్ తీసుకోవడం మానేయాలి.  ఎందుకంటే ఇవి దగ్గు, మంట వంటి లక్షణాలను మరింత ఎక్కువ చేస్తాయి. 
 

1313

క్యాండీలు, కోలాలు, కేకులు, సోడాలు, పేస్ట్రీలు, స్వీట్లు, జ్యూస్ లు, కృత్రిమ స్వీటెనర్ లు, ప్రిజర్వేటివ్ లు మొదలైన వాటిని కలిగి ఉన్నఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే హెపటైటిస్  లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories