ఆహారంతో పాటుగా టీ కూడా మన దినచర్యలో ఒకభాగమైపోయింది. అయితే టైప్ 2 డయాబెటీస్ తో బాధపడేవారికి టీ మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అన్న ముచ్చట తెల్వకుండా తాగేస్తుంటారు. పాలు, చక్కెరతో తయారుచేసిన టీ షుగర్ పేషెంట్లకు ఏ మాత్రం మంచిది కాదు. టీ తయారు చేయడానికి మనం ఉపయోగించే పాలలో చక్కెర స్థాయిలను పెంచే కొన్ని ఐజిఎఫ్ అణువులు ఉంటాయి. టీ లో పంచదార కలిపి తాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అందుకే మధుమేహులు పాలు, పంచదార కలిపిన టీకి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. న్యూట్రిషనిస్ట్ కవితా దేవ్ గన్ మాట్లాడుతూ.. డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్యకరమైన టీ లను బేషుగ్గా తాగొచ్చు. వాటిలో పాలను మిక్స్ చేయకూడదు. మధుమేహులకు మేలు చేసే టీ లేంటో ఇప్పుడు తెలుసుకుందాం..