World Heart Day : ఈ ఆహారాలతో మీ గుండె పదిలం...

First Published Sep 29, 2021, 4:39 PM IST

 గుండె ఆరోగ్యం విషయానికి వస్తే, శరీరం మొత్తం పనితీరును ప్రభావితం చేసే విధంగా ఆహారపు అలవాట్లు ఉండాలి. ఈ వరల్డ్ హార్ట్ డే నాడు ప్రపంచ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో.. తెలుసుకోండి. 

మనం తినే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతారు. అందుకే దీర్ఘకాలంలో శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి మనం తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఇక, గుండె ఆరోగ్యం విషయానికి వస్తే, శరీరం మొత్తం పనితీరును ప్రభావితం చేసే విధంగా ఆహారపు అలవాట్లు ఉండాలి. ఈ వరల్డ్ హార్ట్ డే నాడు ప్రపంచ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో.. తెలుసుకోండి. 

ఆకుపచ్చ ఆకు కూరలు : పాలకూర, మెంతి, ముల్లంగి ఆకులు వంటి కూరగాయలు ఆరోగ్యకరమైనవి. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ ఆహారాలలో కొవ్వు, కేలరీలు, డైటరీ ఫైబర్ చాలా తక్కువగా ఉన్నాయని నిరూపించబడింది. వీటిలో ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం మొదలైనవి కూడా ఉన్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, ప్రతిరోజూ తమ ఆహారంలో ఆకుకూరలు చేర్చడం ద్వారా 10-12 శాతం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

వీటిని స్మూతీలు, సూప్‌లలో చేర్చాల్సిన అవసరం లేదు. సాంప్రదాయ సాగ్, పాలక్ పనీర్, ఆలూ మేథి, మూలి పట్టా సాగ్‌ని లుగా.. పప్పు, కూరలుగా తినొచ్చు.

యాపిల్స్ : యాపిల్స్ లో గెర్సెటిన్ అనే యాంటీ కెమేకల్ కలిగి ఉన్న ఫోటో కెమికల్స్ ఉంటాయి. ఆపిల్ తినడం వల్ల రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించొచ్చు. గుండెపోటు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. అలాగని ప్రత్యేకంగా గ్రీన్ ఆపిల్, వైట్ ఆపిల్, ఇంపోర్టెడ్ అని తిననక్కరలేదు. సీజన్లో దొరికే ఏ ఆపిల్ అయినా అవే ప్రయోజనాల్ని ఇస్తాయి. ఆపిల్స్ ను ఫ్రూట్ సలాడ్, చట్నీ, సెబ్ కి సబ్జీగా కూడా ఆనందిస్తారు. 

శనగపిండి : శనగపిండిలో కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది గుండెకు మంచిది. శనగపిండిలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండె సరైన పనితీరుకు, ఆరోగ్యకరమైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది. కనీసం వారానికి ఒకసారైనా శనగపిండి చీలను అల్పాహారంగా, భోజనం కోసం కడి, డెజర్ట్ కోసం గుడ్‌తో బేసన్ హల్వా తీసుకోవాలి. మీరు మిస్సీ రోటీని కూడా ప్రయత్నించవచ్చు. 

మజ్జిగ : మజ్జిగ తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ గట్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, మజ్జిగలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే, ఇతర హానికరమైన రక్త లిపిడ్‌లను అదుపులో ఉంచే, గుండెపోటును నివారించే కొన్ని జీవ అణువులను ఉన్నట్లు కనుగొనబడింది. భోజనానికి ఒక గ్లాసు ఛాస్ లేదా లస్సీ బ్రేక్ ఫాస్ట్ లేదా వెజిటబుల్ రైతా తీసుకోండి. 

డాలియా : డాలియాలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. తద్వారా గుండెకు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడుతుంది.

దేశీ నెయ్యి : నెయ్యిలో కొవ్వు అధికంగా ఉన్నప్పటికీ, ఇందులో అధిక సాంద్రత కలిగిన మోనోఅన్‌శాచురేటెడ్ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి, ఇవి ఆరోగ్యకరమైన గుండె, హృదయనాళ వ్యవస్థకు తోడ్పడతాయి. సమతుల్య ఆహారంలో భాగంగా దేశీ నెయ్యిని క్రమం తప్పకుండా ఉపయోగించడం అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని నిరూపించబడింది. కానీ రోజుకు 2 టీస్పూన్ల కంటే ఎక్కువ తీసుకోవద్దు. నెయ్యిని పప్పులో, అన్నంలో, చపాతీల్లో కలిపి తినవచ్చు. 

కరివేపాకు : నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ (చెడు కొలెస్ట్రాల్) ను ఉత్పత్తి చేసే కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నివారించడంలో సహాయపడతాయి. కరివేపాకు రెగ్యులర్ వినియోగం మంచి కొలెస్ట్రాల్ (HDL) మొత్తాన్ని పెంచడానికి, గుండె జబ్బుల నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. కరివేపాకును అన్ని కూరల్లోనూ వేసుకోవచ్చు. 

click me!