Navratri 2021: దుర్గాదేవి ‘సింహవాహిని’ ఎలా అయ్యిందో తెలుసా?

First Published | Sep 29, 2021, 3:04 PM IST

అమ్మవారు సింహవాహిని.. ఆమె అన్ని చిత్రాలలో, మా దుర్గా సింహంపై స్వారీ చేయడం కనిపిస్తుంది. అడవికి రాజైన సింహం, జంతువుల్లో అతి క్రూరమైన సింహం అమ్మవారి వాహనం ఎలా అయ్యింది. దీనికి పురాణాల్లో ఏమైనా కారణాలున్నాయా? 

durgadevi

ఈ యేడు నవరాత్రులు అక్టోబర్ 7నుంచి ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో.. ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రకాల రూపాల్లో దుర్గాదేవిని ఆరాధిస్తారు. 

దుర్గామాత దీవెనలు, ఆశీర్వాదాలు, అనుగ్రహం పొందడానికి ప్రజలు కూడా ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటారు. హిందువులకుదుర్గాదేవి అత్యంత గౌరవనీయమైన దేవత. ఆమెను బలం, రక్షణ, ధైర్యం, విధ్వంసం, మాతృత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. 


అమ్మవారు సింహవాహిని.. ఆమె అన్ని చిత్రాలలో, మా దుర్గా సింహంపై స్వారీ చేయడం కనిపిస్తుంది. అడవికి రాజైన సింహం, జంతువుల్లో అతి క్రూరమైన సింహం అమ్మవారి వాహనం ఎలా అయ్యింది. దీనికి పురాణాల్లో ఏమైనా కారణాలున్నాయా? 

అంటే.. హిందూ పురాణాల ప్రకారం, దాదాపు ప్రతి దేవతకు ఒక వాహనం ఉంటుంది. ఉదా.కు శివుడి వాహనం నంది - ఎద్దు, వినాయకుని వాహనం మూషికం (ఎలుక), కుమారస్వామి వాహనం నెమలి...అలాగే అమ్మవారి వాహనం సింహం.

the lion king

సింహం అమ్మవారి వాహనంగా మారడం వెనుక ఓ ఆసక్తికర కథనాన్ని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి శివుడు ధ్యానం కోసం కూర్చుని, ధ్యాన స్థితిలోకి పూర్తి స్తాయిలో వెళ్లిపోతాడు. ఎన్నాళ్లైనా అందులోనుంచి బయటికి రాదు. దుర్గాదేవి రూపమైన పార్వతీదేవి ఆయన కోసం వేచి చూసీ చూసీ అలిసిపోతుంది. శివుడు ధ్యానంలో నిమగ్నమై పూర్తిగా మరిచిపోతాడు. దీంతో పార్వతీ దేవి కైలాసాన్ని విడిచిపెట్టి, తపస్సు కోసం దట్టమైన అడవిలోకి వెడుతుంది. అక్కడ పార్వతీదేవి ధ్యానంలో మునిగిపోయిన సమయంలో ఆకలితో ఉన్న ఒక సింహం ఆమెను తినడానికి ఆమె దగ్గరికి వస్తుంది. 

సింహం పార్వతీ దేవి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె చుట్టూ ఉన్న రక్షణ కవచం వల్ల అందులోకి చొచ్చుకెళ్లడంలో విఫలమైంది. అందుకే సింహం పార్వతీదేవి ధ్యాన స్థితి నుండి బయటకు వచ్చే వరకు వేచి ఉంటుంది. ఇంతలో, శివుడు  పార్వతిదేవి తపస్సుకు సంతోషించి, ఆమెను తిరిగి తీసుకెళ్లడానికి దట్టమైన అడవికి వస్తాడు. దీంతో పార్వతీదేవి ధ్యానం నుంచి మేల్కొంటుంది. 

durgadevi1

ఆ సమయంలో తనకోసం వేచి ఉన్న ఆకలి గొన్న సింహాన్ని చూస్తుంది. దానికి చూడగానే పార్వతీదేవి తన శక్తితో సింహం తనను తినాలని కోరుకుంటుందని  గ్రహిస్తుంది. కానీ తను ధ్యానంలో ఉండడం వల్ల.. ధ్యానం నుంచి బయటకు వచ్చే వరకు వేచి ఉందని తెలుసుకుంటుంది. సింహం క్రూర జంతువు అయినా, తనను తినాలని చూసినా.. దాని దీనస్థితికి అమ్మవారిలోని మాతృహృదయం కరుగుతుంది. సింహం మీద జాలిపడి పార్వతీదేవి దాన్ని తనతో తీసుకు వెడుతుంది. ఆ రోజు నుంచి సింహం ఆమె వాహనంగా మారిపోయిందని పురాణ కథనాలు చెబుతాయి. 

Latest Videos

click me!