చర్మానికి చక్కటి ఔషధం..విటమిన్ సి...ఎలాగంటే..

First Published | Sep 29, 2021, 3:56 PM IST

విటమిన్ సీ కీలకమైన, నీటిలో కరిగే పోషకం.. ఇది ఫ్రీ రాడికల్స్ లో పోరాడుతుంది. పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. చర్మపు రంగును ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది. చర్మాన్ని మచ్చలు లేకుండా, నీరసంగా లేకుండా ఉండకుండా కాపాడుతుంది. 

మీ చర్మసంరక్షణకు, పోషణకు, అందానికి అవసరమైన అతి ముఖ్యమైన పదార్ధం విటమిన్ సి. ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన పోషకం అది. ఇది మీ చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. చర్మ సంరక్షణలో పవర్‌హౌస్ యాంటీఆక్సిడెంట్ విటమిన్ సి.  అయితే రోజులో పగలు, రాత్రి చర్మ సంరక్షణ దినచర్యలో విటమిన్ సిని ఎలా చేర్చవచ్చో.. తెలుసుకునే ముందు.. విటమిన్ సి చేసే అద్బుతాల గురించి తెలుసుకుందాం. 

విటమిన్ సి చర్మానికి మల్టీ టాస్కింగ్ గా పనిచేస్తుంది. రిఫ్రెష్ మెంట్ గా ఉండే విటమిన్ సి ఫేస్ వాష్‌తో మీ రోజును ప్రారంభించడం వలన మీ చర్మం దాని సహజ తేమకు భంగం కలిగించకుండా శుభ్రపరుస్తుంది. టోనర్ దానిని హైడ్రేట్ చేస్తుంది. చర్మం చికాకును తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది. మీ సన్‌స్క్రీన్‌తో పాటు విటమిన్ సి డే క్రీమ్‌ని అప్లై చేయడం వలన హానికరమైన సూర్యకిరణాల నుండి మీకు మరింత రక్షణ కల్పిస్తుంది.

Latest Videos


1. విటమిన్ సీ కీలకమైన, నీటిలో కరిగే పోషకం.. ఇది ఫ్రీ రాడికల్స్ లో పోరాడుతుంది. పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. చర్మపు రంగును ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది. చర్మాన్ని మచ్చలు లేకుండా, నీరసంగా లేకుండా ఉండకుండా కాపాడుతుంది. 

2. విటమిన్ సి కణ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. మీ చర్మాన్ని మరింత కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబ్రోబ్లాస్ట్‌లను ఉత్పత్తి చేయడాన్ని ప్రేరేపిస్తుంది. అందువల్ల, మీ చర్మ సంరక్షణడైలీ రొటీన్ లో విటమిన్ సిని జోడించడం వలన మీ చర్మం బిగుతుగా, బొద్దుగా కనిపిస్తుంది.

3, విటమిన్ సి మీ స్కిన్ టోన్‌ను ప్రకాశవంతం చేయడమే కాకుండా, చర్మం మృదువుగా మారడానికి, చర్మం ఆకృతిని సున్నితంగా చేయడానికి సహాయపడుతుంది.

4. దాదాపు 64% చర్మం నీటితో తయారు చేయబడుతుంది. అందువల్ల, దానిని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం. విటమిన్ సి మీ చర్మాన్ని తేమను నిలుపుకునేలా చేస్తుంది. దానిని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది మెరిసే, ఆరోగ్యకరమైన రూపాన్ని ఇస్తుంది.

5. ఎండవేడికి లేదా మరే ఇతర కారణాల వల్ల మంటలు లేదా ఎర్రబడటంతో ఇబ్బంది పడుతున్న వారికి విటమిన్ సి చాలా మంచిది. ఇది ఎర్రబడడం, దద్దుర్లు, దురద, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. 

విటమిన్ సి సీరంలు నీటి ఆధారితమైనవి, తేలికైనవి, సులభంగా గ్రహించబడతాయి. ఇది జిడ్డు చర్మానికి కూడా సురక్షితమైన, ప్రభావవంతమైన, సీరం ఇతర ప్రయోజనాలతో పాటు, మీ చర్మంలో తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. 

ఇవన్నీ వింటుంటే మీ చర్మసంరక్షణలో విటమిన్ సి ఎంత అద్బుతంగా పనిచేస్తుందో అర్తమవుతుంది కదా... 

AM లేదా PM : మృదువైన, ప్లఫ్పీ చర్మం కోసం ఈ విటమిన్ సీ ని ఎప్పుడు ఎలా వాడితో మంచిదో ఇప్పుడు చూద్దాం. 

విటమిన్ సి డే క్రీమ్ లో కనీసం SPF15 ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మీ చర్మాన్ని సూర్యకిరణాల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కాపాడుతుంది. ఇది రాత్రి సమయంలో చర్మానికి విటమిన్ సి డోసుగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు చర్మం దాని సహజ మరమ్మత్తు ప్రక్రియను మొదలుపెడుతుంది. కాబట్టి, రాత్రిపూట చర్మ సంరక్షణకోసం విటమిన్ సి నైట్ క్రీమ్ ను వాడడం వల్ల అత్యంత ప్రభావవంతమైన ఫలితాలు లభిస్తాయి.

ఉదయం విటమిన్ సిని ఇంకా ఎక్కువ ఎలా ఉపయోగించొచ్చు అంటే...  విటమిన్ సి ఫేస్ సీరమ్‌తో పాటు విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను డబుల్ డోస్‌గా ఇస్తాయి.

పగటిపూట విటమిన్ సిని చర్మానికి ఉపయోగించడం వల్ల సూర్యరశ్మికి చర్మం సున్నితంగా మారుతుందని చాలా మంది నమ్ముతారు. కాబట్టి విటమిన్ సి ని రాత్రిపూట మాత్రమే ఉపయోగించాలి అనే అపోహ ఉంది.. అయితే , అది నిజం కాదు. ఈ విటమిన్ స్వచ్ఛమైన రూపంలో ఆమ్లంగా ఉంటుంది, అలాగని వేరేఇతర ఆమ్లాల వలె కాకుండా, విటమిన్ సి సూర్యరశ్మికి సున్నితత్వాన్ని పెంచదు. విటమిన్ సి ఉత్పత్తులను ఎప్పుడూ ఎండపడని చోట భద్రపరచాలి. కారణం ఏంటంటే.. ఇది అందులోని శక్తిని దెబ్బతీస్తుంది. ఉత్పత్తిని ఆక్సీకరణం చేస్తుంది.

click me!