Overthinking Impact: అయ్యయ్యో వద్దమ్మా.. అతిగా ఆలోచిస్తే అంతే సంగతులు..

Published : Feb 11, 2022, 04:41 PM IST

Overthinking Impact: కొంతమందికి ఈ అలవాటు బాగా ఉంటుంది. చిన్ని చిన్న విషయాలకు కూడా బుర్రలు పేలిపోయేలా ఆలోచిస్తూ తలనొప్పి తెచ్చుకుంటారు. వద్దురా బాబూ నువ్ మరీ అంతగా ఆలోచించాల్సిన పనిలేదన్నా అస్సలు వింటేగా.. ఇది కేవలం అక్కరకు రాని ముచ్చటనే అన్నా అస్సలు పట్టించుకోరు. దీని వల్ల ..

PREV
110
Overthinking Impact: అయ్యయ్యో వద్దమ్మా.. అతిగా ఆలోచిస్తే అంతే సంగతులు..

Overthinking Impact: చిన్న చిన్న విషయాలను పట్టుకుని ఎక్కువగా ఆలోచిస్తున్నారా? ఏమైతుందో? ఎట్లైతుందో? అంటూ ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారా? ఈ అలవాటును మానేద్దామన్నా... మానలేకపోతున్నారా..? అయితే ఈ విషయాలను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 
 

210

ఓవర్ థింకింగ్ వల్ల ఒరిగేదేమీ లేదనే విషయం మీరు ముందుగా గ్రహించాలి. దానివల్ల కేవలం మీరు పొందేవి ఏంటో తెలుసా.. మానసిక ప్రశాంతతను కోల్పోవడం. అలాగే మీరు చేస్తున్న పని చేడిపోవడం కూడా కన్ఫామ్. ఈ అతి ఆలోచనల వల్ల మనకేమన్నా వస్తుందా అంటే అవి ఇవేనని చెప్పాలి. అంతేకాదండోయ్.. ఈ ఓవర్ థింకింగ్ వల్ల మానసిక రోగాలు కూడా వచ్చే ప్రమాదముందని ఓ  అధ్యయనం పేర్కొంటోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

 

310

మెదడుపై భారం: అతిగా ఆలోచించడం వల్ల మెదడుపై తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. అక్కర్లేని ముచ్చట్లకు అతిగా ఆలోచించడం వల్ల మనకు ఎలాంటి లాభం లేదు. పరిస్థితులను మార్చలేనప్పుడు వాటి గురించి అతిగా ఆలోచించడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రమాదకరమైన రోగం కాకపోయినా ఫ్యూచర్ లో మానసిక రోగంగా మారుతుందట.

410

నిరాశ: చాలా మంది సంతోషానిచ్చే విషయాల కంటే బాధను కలిగించే విషయాలను గుర్తుపెట్టుకుని వాటినే ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని తెగ బాధపడిపోతుంటారు. అలా చేయకుండేదుండే.. అలా ఎలా చేశాను. నేను పెద్ద తప్పు చేశాను అంటూ ఆలోచిస్తూ ప్రజెంట్ లైఫ్ ను వీళ్లు ఎంజాయ్ చేయలేరు. ఇది ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం వారు నిరాశలోకి జారుకోవడం తప్పనిసరిగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిమూలంగా జీవితంపై విరక్తి పుట్టే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
 

510
office

దూరంగా: ఈ అతి ఆలోచన చేసే అలవాటున్న వారు పక్కవారితో మాట్లాడటానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే వారిని అవతలి వారు ఎలా చూస్తారనే విషయంపై తెగ బాధపడిపోతుంటారు. దీనివల్లనే వారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంటారు.

610

ఆటంకం: గంటలకు గంటలు అతి ఆలోచనలో మునిగిపోవడం వల్ల మీ రోజు వారి జీవితంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే దానివల్ల పనులను పర్ఫెక్ట్ గా చేయలేను. అంతేకాదు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగినా.. మీనుంచి జవాబు ఎప్పటికో వస్తుంది. దీని కారణంగా మీరు మీ జాబ్ ను వదులుకోవాల్సి వస్తుంది.

710

టైం వేస్ట్: అతిగా ఆలోచించడం వల్ల టైం వేస్ట్ తప్పా మరేది రాదనేది వాస్తవం. అంతేకాదు దీనివల్ల మీ మూడ్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకు ఈ ఆలోచనల నుంచి ఎంత తొందరగా బయటకొస్తే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా దీనినుంచి బయటపడటానికి కొన్ని సూచనలు చేశారు. అవేంటంటే.. 

810

ఏదైనా ఒక విషయం గురించి ఆలోచన వస్తే.. ముందుగా ఆ విషయం గురించి ఆలోచిస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా ? అని మీకు మీరే ప్రశ్నించుకోవాలి. అలాగే ఆలోచించింది చాలు ఇక .. దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మీ మనస్సుకు చెప్పుకోవాలి. మీ మైండ్ ను ఆ ఆలోచన నుంచి డైవర్ట్ చేయాలి.
 

910

పంచేంద్రియాలై  దృష్టి పెట్టడం ద్వారా కూడా మన మూడ్ ను మార్చవచ్చు. దీని వల్ల ఎటో వెళ్లిన ఆలోచనలను, మీ మైండ్ ను ప్రజెంట్ లోకి తీసుకురావొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

1010


మీరు ఎక్కువగా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారో దాన్ని మీ డైరీలో రాయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉండదు. మీకు తెలుసా.. ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించడం వల్ల మన ప్రజెంట్ లైఫ్ అంతా బాధాకరంగానే ఉంటుంది.. కానీ దాన్ని ఎంజాయ్ చేయలేము. కాబట్టి ఆలోచనలకు స్వస్తి చెప్పి ప్రజెంట్ మూమెంట్ ను ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకోండి. 

Read more Photos on
click me!

Recommended Stories