కంటి సమస్యలు: ఎక్కువ సేపు ఫోన్ చూసే వారికి కంటిచూపు దెబ్బతినడం పక్కాగా జరుగుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అందుకే ఎక్కువ సేపు ల్యాప్ టాప్ లు, ఫోన్లు, టీవీలు చూసేవారు ముందు జాగ్రత్తగా కళ్లద్దాలను పెట్టుకోవడం మంచిది. మీకు తెలుసా.. ఎక్కువ సేపు ఎవరైతే స్క్రీన్ను చూస్తారో వారికి ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ అనే వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఈ సమస్య వల్ల తీవ్రమైన తలనొప్పి, కంటిచూపు మందగించడం, కళ్లపై ఒత్తిడి పడటం, పొడి బారడం వంటివి తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఫోన్ చూసే సమయాన్ని తగ్గిస్తే అన్ని విధాల మంచి జరుగుతుంది.