చలికాలంలో పిల్లలకు ఎలాంటి జబ్బులు రాకూడదంటే ఇలా చేయండి..

First Published Dec 17, 2022, 12:54 PM IST

చల్లటి వాతావరణం కారణంగా పిల్లలు తరచుగా దగ్గు, జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అయితే ఈ సీజన్ లో కొన్ని చిట్కాలను ఫాలో అయితే మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచొచ్చు. అవేంటంటే.. 
 

చలికాలంతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే పిల్లలే ఈ సీజన్ లో ఎక్కువగా అనారోగ్యానికి గురవుతుంటారు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. అందుకే ఈ చలికాలంలో పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడం చాలా అవసరం. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉండదు. సాధారణంగా చలికాలంలో పిల్లలకు జలుబు, దగ్గు, న్యూమోనియా, ఫ్లూ, చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసలోపం, కడుపునకు సంబంధించిన సమస్యలు, ఉబ్బసం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే తల్లిదండ్రులు పిల్లల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. అవేంటంటే.. 

అనవసరమైన యాంటీబయాటిక్స్ ఇవ్వండి

సాధారణ జలుబుకు,  ఫ్లూకు  డాక్టర్ ను అడిగే మెడిసిన్స్ ను ఇవ్వాలి. కానీ చాలా మంది తల్లిదండ్రులు డాక్టర్ తో పనిలేకుండా మందులను వేస్తుంటారు. డాక్టరుతో మాట్లాడకుండా బిడ్డకు ఎలాంటి యాంటీబయాటిక్స్ ఇవ్వకూడని నిపుణులు చెబుతున్నారు. మీకు తెలుసా యాంటీబయాటిక్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. 
 

బిడ్డ హైడ్రేటెడ్ గా ఉండేలా చూడాలి

చలికాలంలో పెద్దలే కాదు పిల్లలు కూడా నీళ్లను ఎక్కువగా తాగరు. కారణం నీళ్లు చల్లగా ఉంటాయని. అయితే చల్లని నీటిని తాగడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే పిల్లలకు నీటిని మరిగించి ఇవ్వడం మంచిది. శరీరంలో తగినంత నీరుంటేనే శరీరంలోచి విష పదార్థాలు బయటకు పోతాయి. 
 

వేయించిన ఆహారాలను తగ్గించండి

చలికాలంలో వేయించిన ఆహారాలనే ఎక్కువగా తింటుంటారు.  ఇక పిల్లలైతే ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, బర్గర్లు లేదా ఇతర డీప్ ఫ్రైడ్  ఆహారాలనే ఎక్కువగా తింటుంటారు. కానీ ఈ స్నాక్స్ ను  పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. నిపుణులు సిఫారసు చేసిన పరిమాణంలో కాల్చిన మఖానా, పాప్ కార్న్, ఉడికించిన మొక్కజొన్న, గింజలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను పెట్టండి. ప్రోటీన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. 
 

ఆరుబయట వ్యాయామం చేయించండి

పిల్లలు ఆరుబయట వ్యాయామం చేసేలా చూడాలి. అలాగే ఇతర పిల్లలతో ఆడుకునేలా చేయండి. వాళ్లు తగినంత సూర్యరశ్మిని పొందేలా చూడండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పిల్లల  ఆరోగ్యంగా బాగుంటుంది. ఇది వారి ఎముకలను బలంగా చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నిద్రను మెరుగుపరచండి

పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి నాణ్యమైన నిద్ర చాలా చాలా అవసరం. ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల పిల్లల పెరుగుదల బాగుంటుంది. ఎలాంటి వ్యాధులు లేకుండా ఉంటారు. 
 

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని పెట్టండి

తల్లిదండ్రులు పిల్లల మెనూలో పన్నీర్, చికెన్, సోయా, చిక్పీస్, పాలు వంటి పోషకాహారాలనే పెట్టండి. వాళ్ల ఆహారంలో తగినంత ప్రోటీన్ ఏండే.. ఏదైనా గాయం అయినా అవి తొందరగా మానిపోతాయి. అలాగే కండరాల పెరుగుదల బాగుంటుంది. 

click me!