ఆయుర్వేదం ప్రకారం కీర దోసకాయకు మూడు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. శీతలీకరణ, వైద్యం, ఆస్ట్రిజెంట్. ఇది మొక్కల ఆధారిత ఆహార పదార్థం. దీని లక్షణాలు సేంద్రీయమైనవి. ఈ కీరా శరీరాన్ని చల్లబర్చడానికి సహాయపడుతుంది. కడుపులో వేడిని ఉత్పత్తి చేసే ఔషదం లేదా ఏదైనా ఆహార పదార్థానికి అలెర్జీ అయితే దానిని తగ్గిస్తుంది. అలాగే కాలిన గాయలను, మొటిమలను, దద్దుర్లను తగ్గిస్తుంది. కీరదోసకాయ కఫ, పిత్తం, వాతం వంటి మూడు దోషాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తుంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ముందే చలికాలం.. ఈ సీజన్ లో కీరాను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.