మీ జుట్టు, చర్మం, గోర్లు ఇలా అయ్యాయా? అయితే మీ బాడీలో ఈ లోపమున్నట్టే..

First Published Nov 28, 2022, 9:46 AM IST

మన శరీరానికి ఇనుము చాలా అవసరం. ఇది లోపిస్తే.. మన శరీరంలోని ఎన్నో భాగాల్లో దీని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా జుట్టు, చర్మం, గోళ్లపై పై కనిపిస్తాయి.
 

iron deficiency

మన శరీరం హిమోగ్లోబిన్ ను తయారుచేయడానికి ఐరన్ చాలా అవసరం. ఇది ఎర్ర రక్తకకణాలు రక్త నాళాల ద్వారా ఆక్సిజన్ ను తీసుకెళ్లడానికి సహాయపడుతుంది. ఐరన్ లోపం వల్ల ఇనుము లోపిస్తుంది. అలాగే కండరాలు, కణజాలాలు తగినంత ఆక్సిజన్ అందదు. ఐరన్ లోపం వల్ల చర్మం, జుట్టు, గోళ్లు ప్రభావితం అవుతాయి. వీటిపై ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఇనుము లోపం మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఐరన్ లోపం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పాలిపోయిన చర్మం

ఎర్ర రక్తకణాలలోని హిమోగ్లోబిన్ మీ అరచేతులు, బుగ్గలకు వాటి సహజ ఎరుపు లేదా గులాబీ రంగును ఇస్తుంది. అయితే మీ శరీరంలో ఇనుము తగినంతగా లేకపోతే చర్మం రంగు మారుతుంది. చర్మం పాలిపోతుంది. 
 

hair fall

జుట్టు రాలుతుంది

ఈ రోజుల్లో జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది. హెయిర్ ఫాల్ కు కారణాలెన్నో ఉన్నా.. శరీరంలో ఇనుము లోపిస్తే కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. నడినెత్తిలో జుట్టు విపరీతంగా రాలుతుంటే మీ శరీరంలో ఇనుము లోపం ఎక్కువగా ఉందని అర్థం చేసుకోండి. 
 

పాలిపోయిన కనురెప్పలు

సాధారణంగా కనురెప్పల  లోపలి భాగం బాగా ఎరుపు రంగులో ఉంటుంది. అయితే శరీరంలో ఇనుము లోపం ఏర్పడితే మీ కునురెప్పల లోపలి భాగం రంగు తగ్గుతుంది. అంటే కనురెప్పల లోపలి భాగాలు పాలిపోయి ఉంటాయి. 

హెయిర్ డ్యామేజ్

ఐరన్ లోపం వల్ల జుట్టు పొడిబారుతుంది. అలాగే బాగా దెబ్బతింటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పడిపోయినప్పుడు జుట్టు కణాలు జుట్టు సమర్థవంతంగా పెరిగేందుకు అవసరమైన ఆక్సిజన్ ను పొందలేవు. దీనివల్ల జుట్టు దెబ్బతింటుంది. 
 

పెళుసైన గోళ్లు

ఇనుము లోపం సంకేతాలు గోళ్లపై కూడా కనిపిస్తాయి. ఇనుము లోపం వల్ల మీ గోర్లు సులువుగా విరిగిపోతాయి. గోర్ల చివరణ, మధ్య కర్వ్ షేప్ లో తెల్లగా కనిపిస్తుంది. ఇనుము లోపం వల్ల గోళ్ల రంగు కూడా మారుతుంది.  
 

నాలుక నొప్పి, అలసట, బలహీనత, ఛాతిలో నొప్పి, చేతుల్లో తిమ్మిరి, నాలుకపై పుండ్లు అవడం వంటివన్నీ ఇనుము లోపం సంకేతాలు. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే ఇనుము పుష్కలంగా ఉండే పండ్లను, కూరగాయలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇనుము లోపం ఎన్నో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. 

click me!