Sun Screen: బయట ఎండ లేదు కదా.. చలికాలంలోనూ సన్ స్క్రీన్ ఎందుకు రాసుకోవాలి?

Published : Nov 09, 2026, 05:33 PM IST

Sun Screen: ఎండాకాలంలో దాదాపు అందరూ సన్ స్క్రీన్ రాసుకుంటారు. కానీ, చలికాలంలో అసలు ఎండ ఉండదు కదా మరి.. చలికాలంలో సన్ స్క్రీన్ ఎందుకు రాసుకోవాలి? రాసుకోకపోతే కలిగే నష్టం ఏంటి?

PREV
13
సన్ స్క్రీన్ వాడుతున్నారా?

చాలామంది చలికాలం రాగానే సన్‌స్క్రీన్ వాడటం పూర్తిగా మానేస్తుంటారు. ఆకాశంలో ఎండ కాస్త మందగించడం, చల్లటి గాలి వీస్తుండటంతో సన్‌స్క్రీన్ అవసరం లేదని భావిస్తుంటారు. కానీ, నిపుణులు ఏం చెబుతున్నారు? వర్షాకాలం, చలికాలంలో సన్ స్క్రీన్ ఎందుకు రాసుకోవాలి? కలిగే ప్రయోజనాలు ఏంటి?

23
1. చలికాలంలోనూ UV కిరణాలు..

చలికాలంలో చలిగా ఉన్నప్పటికీ, సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన యువి-ఎ (UVA) కిరణాల తీవ్రత తగ్గదు.ఈ కిరణాలు మేఘాలను, పొగమంచును సులభంగా దాటుకుని భూమిపైకి వస్తాయి. UVA కిరణాలు చర్మం లోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి ముడతలు, చర్మం పొడిబారడం, ఫైన్ లైన్స్‌కు కారణమవుతాయి. కాబట్టి ఎండ లేకపోయినా ఈ కిరణాల నుండి రక్షణ పొందాలి అంటే సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాయాలి.

2. మంచు ప్రాంతాల్లో మరింత ప్రమాదం 

మీరు చలికాలంలో మంచు కురిసే ప్రాంతాలకు ట్రిప్ వెళ్తే ప్రమాదం ఇంకా ఎక్కువ. ఎందుకంటే మంచు సూర్యరశ్మిని తిరిగి చర్మంపైకి పరావర్తనం చేస్తుంది. దీనివల్ల చర్మం త్వరగా నల్లబడుతుంది.

3. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది 

చలికాలంలో గాలిలో తేమ తగ్గిపోయి చర్మం త్వరగా పొడిబారుతుంది. మంచి సన్‌స్క్రీన్ వాడటం వల్ల చర్మంలో తేమ పోకుండా రక్షణ పొరలా పనిచేసి, చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

4. చలికాలపు ఎండతోనూ నష్టమే.. 

చలికాలంలో ఉదయాన్నే ఎండలో కూర్చోవడం హాయిగా ఉంటుంది. కానీ ఎక్కువ సేపు ఆ ఎండలో ఉండటం వల్ల చర్మంపై నల్లటి మచ్చలు వచ్చి, ముఖం కాంతిహీనంగా మారుతుంది.

33
చలికాలంలో ఎలాంటి సన్‌స్క్రీన్ వాడాలి?

క్రీమ్ లేదా లోషన్ సన్‌స్క్రీన్: చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్ గుణాలున్న క్రీమ్ లేదా లోషన్ బేస్డ్ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి.

SPF 30 లేదా అంతకంటే ఎక్కువ: కనీసం SPF 30 ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ వాడటం మంచిది.

తేమను ఇచ్చేవి: హైల్యూరోనిక్ యాసిడ్ లేదా సిరమ్స్ ఉన్న సన్‌స్క్రీన్స్ చర్మాన్ని రోజంతా తేమగా ఉంచుతాయి.

సన్‌స్క్రీన్ ఎలా వాడాలి? ఎప్పుడు రాయాలి?: ఉదయం స్నానం చేసి, మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత ముఖం, మెడ, చేతులకు సన్‌స్క్రీన్ అప్లై చేయాలి.

మళ్లీ ఎప్పుడు రాయాలి?: మీరు ఎండలో ఎక్కువ సమయం ఉంటే ప్రతి 2 నుండి 3 గంటలకొకసారి మళ్లీ రాసుకోవాలి.

ఇంట్లో ఉన్నా సరే: కిటికీల గుండా వచ్చే లేత ఎండ వల్ల కూడా చర్మానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడూ రాసుకోవడం మంచిది.

చలికాలం కదా అని సన్‌స్క్రీన్‌ను పక్కన పెట్టకుండా, ప్రతిరోజూ వాడుతూ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories