నీతా అంబానీ సహా అంబానీ ఫ్యామిలీ మేకప్, హెయిర్ స్టైలింగ్ చూసుకునే ఫేమస్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఓజాస్ రజానీ. ముంబైకి చెందిన ఓజాస్ రజానీకి బ్యూటీ, ఫ్యాషన్ ఇండస్ట్రీలో 30 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. నీతా అంబానీకి మాత్రమే కాదు, శ్లోకా అంబానీ, రాధికా మర్చంట్లకు కూడా స్పెషల్ ఈవెంట్స్, గ్రాండ్ ఫంక్షన్లలో మేకప్, స్టైలింగ్ చేసింది ఈమెనే.
రిపోర్ట్స్ ప్రకారం.. ఓజాస్ రజానీ బ్రైడల్, పార్టీ మేకప్ ప్యాకేజీల ఫీజు దాదాపు రూ.1 లక్ష వరకు ఉంటుంది. ఇందులో కేవలం ముఖానికి మేకప్ వేయడమే కాదు.. హై డెఫినిషన్ (HD) మేకప్, హెయిర్ స్టైలింగ్, హెయిర్ ఎక్స్టెన్షన్, శారీ డ్రేపింగ్ లాంటి కంప్లీట్ లుక్ రెడీ చేసే సర్వీసులు కూడా ఉన్నాయి.