Dogs: వీధి కుక్కలు కార్ల వెనక ఎందుకు పడతాయి? అసలు కారణం తెలిస్తే షాకౌతారు..!

Published : Apr 10, 2026, 02:33 PM IST

 Dogs: వీధి కుక్కలు కార్ల వెనక పరుగులు తీయడం ఎప్పుడైనా చూశారా? అలా అవి పరుగులు తీయడం వెనక సైన్స్ ఉందంటే నమ్మగలరా? అసలు అవి అలా ఎందుకు ప్రవర్తిస్తాయో తెలుసా? 

PREV
13
Dog Chasing..

మీరు రోడ్డుపై కారులోనే లేదా బైక్ పై వెళ్తున్నప్పుడు.. అప్పటి వరకు ప్రశాంతంగా పడుకున్న వీధి కుక్కలు ఒక్కసారిగా లేచి మీ కారు, బైక్ వెనక పరుగులు తీయడం చాలా సార్లు గమనించే ఉంటారు. కేవలం వెంట పడటమే కాదు.. గట్టిగట్టిగా అరుస్తాయి. ‘ నేనేమీ అనలేదు కదా.. ఎందుకు అవి అలా వెంటపడుతున్నాయి..?’ అని అనుకుంటూ ఉంటారు. కొందరైతే భయపడిపోతారు కూడా. అసలు... కుక్కలు అలా ఎందుకు ప్రవర్తిస్తాయో తెలుసా? వాటి వింత ప్రవర్తన వెనక బలమైన కారణం ఉంది అంటే నమ్ముతారా? సైన్స్ చెబుతున్న ఆసక్తికరమైన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం....

23
మెయిన్ రీజన్ ఇదే...

కుక్కలకు తాము నివసించే వీధి లేదా ప్రాంతంపై చాలా మక్కువ ఉంటుంది. దాన్ని తమ సొంత సామ్రాజ్యంగా భావిస్తాయి. ఏదైనా కొత్త వాహనం వేగంగా ఆ వీధిలోకి వస్తే, అది తమ సరిహద్దును దాటి వస్తున్న శత్రువు అని అవి పొరబడతాయి. అందుకే, ఆ వాహనానని బయటకు పంపే వరకు మొరుగుతూ వెంబడిస్తాయి.

2.టైర్ల వాసన నచ్చదు...

కుక్కలకు వాసన పసిగొట్టే శక్తి చాలా ఎక్కువ. మీరు కారును మరో వీధిలో పార్క్ చేసినప్పుడు అక్కడి కుక్కలు కారు టైర్లపై మూత్ర విసర్జన చేసి ఉండొచ్చు. మీ కారు మీ వీధిలోకి రాగానే, ఆ టైర్ల మీద ఉన్న బయటి కుక్కల వాసనను స్థానిక కుక్కలు వెంటనే పసిగడతాయి. కారు లోపల వేరే కుక్కలు ఉన్నాయని భావించి, వాటిని వెళ్లగొట్టానికి కారు వెంట పడతాయి.

33
3.కుక్కల స్వభావం...

కుక్కలకు ఏదైనా వస్తువు లేదా జంతువు వేగంగా కదులుతుంటే, దాన్ని వెంటాడి పట్టుకోవడం వాటి స్వభావం. అందుకే కారు వేగంగా వెళ్తుంటే, అది పారిపోతున్న ఏదో జంతువు అని భావించి సరదాగా లేదా సహజంగానే దాని వెనక పరుగెడతాయి.

4. పాత గాయాల భయం

కొన్ని కుక్కలు గతంలో వాహనాల కింద పడి గాయపడి ఉండవచ్చు. అటువంటి భయంకరమైన అనుభవాలు ఉన్న కుక్కలు, మళ్లీ తమకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని భయపడి, వాహనాలను దూరంగా తరిమికొట్టడానికి ప్రయత్నిస్తాయి.

అవి వెంటాడినప్పుడు మీరు ఏం చేయాలి?

చాలామంది కుక్కలు వెంటపడగానే కారును లేదా బైక్‌ను మరింత వేగంగా పోనిస్తారు. దీనివల్ల కుక్కలు ఇంకా ఉత్సాహపడి మరింత వేగంగా పరిగెత్తుతాయి. ఇది కుక్కలకు,మీకు కూడా ప్రమాదకరం. అలా చేయకూడదు. ప్రశాంతంగా ఉండాలి.. వాహనం వేగాన్ని కూడా తగ్గించాలి. మీరు నిదానం గా వెళ్తుంటే.. కాసేపటికే అవి మొరగడం ఆపేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories