Snake Behavior: ఒకే పాము పదేపదే మన ఇంటిముందో, ఇంకెక్కడైనా కనిపిస్తే ఏదో మహిమ అని లేదా పగ పట్టిందనో భయపడతారు. పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోస్తారు. ఆందోళన చెందుతారు. కానీ దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
పాములు పగ పడతాయని మనం వింటుంటాం కానీ, నిజానికి వాటికి ఉన్న అద్భుతమైన 'నావిగేషన్ పవర్' వల్లే అవి ఒకే ప్రదేశానికి మళ్లీ మళ్లీ వస్తుంటాయి. తన చోట నుంచి ఆహారం కోసం ఎంత దూరం వెళ్లినా, అవి పాత చోటును మర్చిపోవు. అందుకే తిరిగి పాత చోటుకే చేరుకోగలవు. ముఖ్యంగా మీ పెరట్లో ఎలుకలు, కప్పలు దొరికినా లేదా అది సురక్షితమైన ఆవాసమని అవి భావించినా, తమకున్న నావిగేషన్ సెన్స్‌తో అక్కడికి వచ్చేస్తాయి. అందుకే ఒకే పాము మీకు పదేపదే దర్శనమిస్తుంటుంది.
25
మళ్లీ మళ్లీ ఆకర్షించే ఒకే ప్రదేశం
ఎండాకాలంలో చల్లదనం కోసం, వానాకాలంలో ఆవాసం కోసం పాములు బయటకు రావడం సహజం. అయితే, ఒకసారి తరిమేసినా అదే పాము మళ్లీ రావడం వెనుక ఎలాంటి మాయా మహిమలు లేవు. దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని వన్యప్రాణి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పాములకు ఉండే అద్భుతమైన జ్ఞాపకశక్తి, పాములు వెళ్లే దారిలో వదిలే 'ఫెరోమోన్' అనే రసాయన వాసన వాటికి గూగుల్ మ్యాప్స్‌లా పనిచేస్తాయి. అందుకే అవి ఒకసారి చూసిన సురక్షితమైన ప్రదేశానికి మళ్లీ మళ్లీ చేరుకుంటాయి.
35
పాత స్థలాలతో ప్రత్యేక అనుబంధం
పాములకు ఒక చోట ఆహారం, రక్షణ దొరికితే ఆ ప్రాంతాన్ని గుర్తుంచుకుంటాయి. దీన్నే 'ఫిడిలిటీ' అంటారు. ఈ స్వభావం వల్లే అవి తమ పాత ఆవాసాలకే పదేపదే వస్తుంటాయి తప్ప, అవి పగ పట్టవు. మీరు వాటిని తరిమేసినా, తమకున్న నావిగేషన్ సెన్స్‌తో మళ్లీ అదే సురక్షిత ప్రాంతానికి చేరుకుంటాయి.
పాములకు మనలా ముక్కుతో కాకుండా, నాలుకతో వాసన పసిగట్టగలవు. గాలిలో, నేలపై ఉండే రసాయన వాసనను గుర్తించడానికి అవి పదేపదే నాలుకను బయటకు తీస్తుంటాయి. పాములు ప్రయాణించే దారిలో 'ఫెరోమోన్లు' (Pheromones) అనే రసాయనాలను వదులుతాయి. ఈ వాసనను అవి గుర్తిస్తాయి. ఒకసారి మీ ఇంటి పరిసరాల్లో ఆహారం దొరికితే, ఈ ఫెరోమోన్ల ఆధారంగా అవి ఎంత దూరమెళ్లినా మళ్లీ పాత చోటుకే కచ్చితంగా చేరుకోగలవు.
55
ఆహారం కోసం పదే పదే వస్తాయి
ఎలుకలు, కప్పలు సులభంగా దొరికే చోట పాములు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంటి చుట్టూ చెత్త, పడేసిన ధాన్యం ఎలుకలను ఆకర్షిస్తాయి. వాటిని తినడానికి పాములు వస్తాయి. ఆహారం దొరుకుతుంటే, ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లడానికి ఇష్టపడవు.