3. పాలలాంటి తెల్లని నదులు
హిమానీనదాల నుంచి వచ్చే నదుల్లోని నీళ్లు కొన్నిసార్లు పాలలాంటి తెల్లని లేదా నీలం-బూడిద రంగులో కనిపిస్తాయి. పర్వతాలపై మంచు కదులుతున్నప్పుడు రాళ్లను అరిగించడం వల్ల అతి సూక్ష్మమైన రాతి కణాలు ఏర్పడతాయి. వీటినే 'గ్లేసియల్ రాక్ ఫ్లోర్' అంటారు. ఈ సూక్ష్మ కణాలు నీటిలో కలిసి సూర్యకాంతిని వివిధ దిశల్లో వెదజల్లడం వల్ల నీరు అలా పాలు కారినట్లు మెరుస్తుంది.
నదులు రంగులు మార్చుకుంటాయా?
అన్ని నదులు ఎప్పుడూ ఒకే రంగులో కినిపంచవు. ఎందుకంటే, అవి కాలాన్ని బట్టి రంగులు మార్చుకుంటూ ఉంటాయి. వర్షాకాలంలో: నేల కోత వల్ల నీరు మట్టి రంగులోకి లేదా ఎర్రటి గోధుమ రంగులోకి మారుతుంది.
వేసవిలో: ప్రవాహం తగ్గిపోవడం, ఆల్గే పెరగడం వల్ల రంగు మారుతుంది.
కాలుష్యం పెరిగితే: మానవ తప్పిదాలు, పారిశ్రామిక వ్యర్థాల వల్ల కూడా నదుల సహజ రంగులు మారిపోతుంటాయి.