Coffee Powder: కాఫీ పౌడర్ గడ్డకడుతోందా? ఇలా చేస్తే..కాఫీ పొడి ఎన్నిరోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది..!

Published : Oct 16, 2026, 01:12 PM IST

Coffee Powder: కాఫీ పౌడర్ వెంటనే గడ్డ కడుతోందా? దానిని వాడలేక.. పారేస్తున్నారా? కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. కాఫీ పొడి ఎన్ని రోజులైనా తాజాగా, మంచి సువాసనలు వెద జల్లుతుంది.

PREV
14
కాఫీ పౌడర్ గడ్డ కడుతోందా?

ప్రతిరోజూ ఉదయాన్నే వేడి వేడిగా కాఫీ తాగితే వచ్చే కిక్కే వేరు. నిద్ర మత్తు వదలడమే కాదు, రోజంతా ఎనర్జిటిక్ గా ఉండేందుకు కూడా సహాయపడుతుంది. కాఫీ పొడి మంచి సువాసనలు వెదజల్లుతుంటేనే.. కాఫీ రుచిగా ఉంటుంది. అలా కాకుండా, కాఫీ పొడి.. గడ్డ కడితే... దాని రుచి పోతుంది. అంతేకాదు.. ఒక్కసారి కాఫీ పొడి గడ్డగా మారితే.. దానితో కాఫీ కలపడం కూడా చాలా కష్టం అవుతుంది. గాలిలో ఉండే తేమ, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగానే కాఫీ పొడి గడ్డకడుతుంది. అలా అవ్వకుండా.. ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా, తాజాగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

24
కాఫీ పొడి గడ్డకట్టడానికి అసలు కారణాలు ఏమిటి?

తేమ ప్రభావం: పొడి గాలిలోని తేమను పీల్చుకున్నప్పుడు దానిలోని రేణువులు ఒకదానికొకటి అంటుకుపోతాయి.

తడి చెంచాలు వాడటం: కాఫీ తీసేటప్పుడు తడి స్పూన్లను నేరుగా డబ్బాలో పెట్టడం వల్ల పొడి త్వరగా పాడవుతుంది.

తప్పుడు ప్రదేశాలు: స్టవ్ లేదా సింక్ దగ్గర ఉంచడం వల్ల వెలువడే వేడి, ఆవిరి కాఫీ నాణ్యతను దెబ్బతీస్తాయి.

34
కాఫీ పొడిని తాజాగా ఉంచే 7 సులభమైన చిట్కాలు:

గాలి చొరబడని డబ్బా వాడండి: గట్టిగా మూత బిగించగల గాజు లేదా నాణ్యమైన స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను మాత్రమే ఉపయోగించండి.

ఎల్లప్పుడూ పొడి చెంచానే వాడండి: కాఫీ డబ్బా కోసం ప్రత్యేకంగా ఒక పొడి చెంచాను ఉంచుకోండి. కొద్దిపాటి తడి కూడా కాఫీ పొడి గడ్డకట్టేలా చేస్తుంది.

సరైన ప్రదేశంలో నిల్వ చేయండి: స్టవ్, సింక్ , నేరుగా ఎండ తగిలే ప్రదేశాలకు దూరంగా, చల్లని పొడి మూలలో డబ్బాను ఉంచండి.

తక్కువ పరిమాణంలో తీసుకోండి: రోజూ వాడే కాఫీని ఒక చిన్న డబ్బాలో వేసుకుని, మిగిలిన పెద్ద ప్యాకెట్‌ను గాలి తగలకుండా భద్రపరచాలి. డబ్బాను కడిగిన తర్వాత పూర్తిగా పొడిగా మారిన తర్వాతే అందులో కాఫీ పొడిని పోయాలి.

ప్యాకెట్‌ను సరిగ్గా మూసివేయండి: కాఫీ ప్యాకెట్ వాడిన వెంటనే గాలి వెళ్లకుండా గట్టిగా సీల్ చేయాలి లేదా ఎయిర్‌టైట్ డబ్బాలోకి మార్చాలి.

అవసరమైనంతే కొనండి: ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కంటే, తక్కువ మోతాదులో తాజా కాఫీ పొడిని కొనుగోలు చేయడం మంచిది.

44
కాఫీ పొడిని ఫ్రిజ్‌లో పెట్టవచ్చా?

చాలా మంది కాఫీ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండటానికి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ రోజువారీ వాడే కాఫీ పొడిని ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది. డబ్బాను తరచుగా బయటకు తీసినప్పుడు మారుతున్న ఉష్ణోగ్రతల వల్ల లోపల తేమ పేరుకుపోయి, కాఫీ సువాసన పూర్తిగా దెబ్బతింటుంది.

కేవలం శుభ్రమైన ఎయిర్‌టైట్ డబ్బా, పొడి చెంచా, సరైన నిల్వ స్థానం అనే ఈ మూడు సూత్రాలను పాటిస్తే చాలు.. మీ కాఫీ పొడి చివరి స్పూన్ వరకు గుమగుమలాడుతూ తాజాగా ఉంటుంది!

Read more Photos on
click me!

Recommended Stories