ముద్దొస్తున్నారని బుజ్జాయిలను ముద్దుపెట్టుకుంటున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!

First Published Jan 27, 2023, 5:00 PM IST

ఎంతకాదనుకున్నా.. చిన్న పిల్లలను చూడగానే వారిని ఖచ్చితంగా ముద్దుపెట్టుకుంటుంటాం. ఇది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. కానీ నవజాత శిశువులను అస్సలు ముద్దు పెట్టుకోకూడదు. 
 

చిన్నపిల్లలను చూస్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. లోకాన్ని మర్చిపోయేలా చేసే వారి అమాయకమైన నవ్వు, చూపులు వారిని క్షణ కాలం కూడా విడువకుండా చేస్తాయి. కానీ చిన్న పిల్లల విషయంలో తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిగా మీరు సహజంగా మీ బిడ్డను పట్టుకుంటారు. ముద్దు పెడతారు. కానీ ఇంటి చుట్టు పక్కల వారందరూ బిడ్డను ఇలా తాకడం మంచిది కాదు. ముఖ్యంగా వారి బుగ్గలు, పెదాలపై అసలే ముద్దును పెట్టనీయకూడదు. ఇది కష్టమే అయినప్పటికీ.. ముద్దు పెడితే మీ బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. నవజాత శిశువును ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పిల్లలు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు వారి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వారు తల్లికడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత వారిని ముద్దు పెట్టుకోకూడదు. ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు పిల్లలకు రాకుండా ఆపడానికి తల్లులతో సహా ప్రతి ఒక్కరూ శిశువులను ముద్దు పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. 
 

సూక్ష్మక్రిములు సులభంగా వ్యాప్తి చెందుతాయి

చర్మం ద్వారా సూక్ష్మక్రిములు చాలా తొందరగా వ్యాప్తి చెందుతాయి. నవజాత శిశువులు దీనికే ఎక్కువగా గురవుతారు. అందుకే పిల్లలను అనవసరంగా ముట్టుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
 

baby food

శ్వాసకోశ సమస్యలు 

నవజాత శిశువు శ్వాసకోశ వ్యవస్థ అంత బలంగా ఉండదు. ఎందుకంటే ఊపిరితిత్తులు పూర్తిగా పరిపక్వం చెందడానికి 8 సంవత్సరాల సమయం పడుతుంది. ముద్దు ద్వారా శిశువుకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

చర్మ సమస్యలు

పెద్దలు ముఖంపై చర్మ సంరక్షణ ఉత్పత్తులను లేదా మేకప్ ను ఉపయోగిస్తారు. ఈ ఉత్పత్తుల వల్ల పెద్దలు కొన్ని ప్రయోజనాలను పొందినప్పటికీ.. చిన్న పిల్లలకు అలా కాదు. దీనివల్ల పిల్లలకు ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ ఉత్పత్తులలో శిశువులకు చర్మ సమస్యలను కలిగించే ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. 
 

అలెర్జీ  

గింజలు, సోయా లేదా ఇతర సాధారణ అలెర్జీ కారకాలు వంటి శిశువుకు అలెర్జీని కలిగిస్తాయి. ఈ ఆహార పదార్థాలను పెద్దలు తింటే.. శిశువుకు అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంది. 
 

ఫ్లూ

ఫ్లూ అనేది పెద్దలకు చిన్న అనారోగ్య సమస్యే. కానీ శిశువులకు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. చిన్నారులకు ముద్దు పెట్టడం వల్ల జలుబు లేదా ఫ్లూ లు వచ్చే అవకాశం ఉంది. ఇవి స్పర్శ ద్వారా  ఒకరి నుంచి ఒకరికి వస్తాయి.

శిశువులను ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలి? 

నవజాత శిశువులను ముద్దు పెట్టుకోకపోవడమే మంచిది. కానీ చిన్నారులకు తల్లి స్పర్శ చాలా అవసరం.  తల్లి స్పర్శతోనే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇతరులు మాత్రం  చిన్నారులను ముట్టుకోవడానికి పరిశుభ్రతను పాటించాలి. శిశువుల రోగనిరోధక వ్యవస్థ మొదటి రెండు నుంచి మూడు నెలల వరకు పరిపక్వం చెందదు. అందుకే ఈ సమయంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి బిడ్డల మధ్య మంచి బంధం ఏర్పడాలంటే జోలపాటలు పాడండి. అలాగే బిడ్డతో జోలి పెట్టండి. మొదటి రెండు మూడు నెలల తర్వాత మీరు నెమ్మదిగా మీ బిడ్డను సున్నితంగా ముద్దు పెట్టుకోవచ్చు. 

click me!