ఈ మంచి అలవాట్లు కూడా ముందస్తు వృద్ధాప్యానికి కారణమవుతాయి.. జర జాగ్రత్త

Published : Jan 27, 2023, 03:55 PM ISTUpdated : Jan 27, 2023, 03:57 PM IST

ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి కొన్ని మంచి అలవాట్లను అనుసరించాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. కానీ అందంగా కనిపించే ఈ అలవాట్లను మరీ ఎక్కువగా అనుసరిస్తే మాత్రం ఉన్న అందం కాస్త పోయి అకాల వృద్ధాప్యం వచ్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.   

PREV
18
 ఈ మంచి అలవాట్లు కూడా ముందస్తు వృద్ధాప్యానికి కారణమవుతాయి.. జర జాగ్రత్త


అలవాట్లు మన వ్యక్తిత్వాన్ని, శరీరాన్ని ప్రభావితం చేస్తాయని చిన్నప్పటి నుంచే వినే ఉంటారు. ఎందుకంటే అలవాట్లు జీవనశైలిలో ఒక భాగం కాబట్టి. మనకు ఇష్టం లేకపోయినా వాటిని అనుసరిస్తాం. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉంటే.. అతని శరీరం అదే అలవాటుకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఎక్కువ సేపు నిద్రపోతే ఇబ్బంది పడతారు. నిజానికి మన అలవాట్లు మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. కానీ కొన్ని మంచి అలవాట్లను మరీ ఎక్కువగా అనుసరించడం వల్ల అకాల వృద్ధాప్యం వస్తుందన్న సంగతి మీకు తెలుసా?

28

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన జీవనశైలిలోని కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా ముందస్తు వృద్ధాప్యానికి కారణమవుతాయి. అవును అనారోగ్యకరమైన అలవాట్లతో పాటు, మన జీవనశైలిలోని కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా త్వరగా వృద్ధాప్యానికి కారణమవుతాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు మన అకాల వృద్ధాప్యానికి ఎలా కారణమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

38

ముందుగా వృద్ధాప్యం అంటే ఏమిటి? 

ఒక నిర్దిష్ట వయస్సుకు చేరుకునే కొద్దీ.. మనమందరం వృద్ధులమవుతాము. కానీ ఆ సమయానికి ముందే మన శరీరంపై, చర్మంపై పెద్దవయస్సు సంకేతాలు ప్రారంభమవ్వడాన్ని ముందస్తు వృద్ధాప్యం లేదా అకాల వృద్ధాప్యం అని అంటారు. నల్ల మచ్చలు, ముడతలు, చర్మం పొడిబారడం లేదా స్కిన్ టోన్ మసకబారడం ప్రారంభ వృద్ధాప్యానికి సంకేతాలు. అంతేకాదు ఛాతీ చుట్టూ హైపర్ పిగ్మెంటేషన్, తరచుగా జుట్టు రాలడం, తెల్లబడటం కూడా అకాల వృద్ధాప్యానికి లక్షణాలు. అసలు ముందస్తు వృద్ధాప్యానికి దారితీసే మంచి అలవాట్లేంటో  ఇప్పుడు తెలుసుకుందాం..
 

48

ముఖాన్ని తరచూ కడుక్కునే అలవాటు

ముఖాన్ని కడగడం వల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, చనిపోయిన కణాలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ తరచుగా ముఖాన్ని కడుక్కునే అలవాటు అంత మంచిది కాదు. ఎందుకంటే  ఇది కూడా ముందస్తు వృద్ధాప్యానికి కారణమవుతుంది. నిజానికి ముఖాన్ని ఎక్కువగా కడగడం వల్ల మీ చర్మం దెబ్బతింటుంది. చర్మంలోని సహజ నూనె తగ్గడం ప్రారంభమవుతుంది. దీనివల్ల చర్మంపై అకాల నల్లమచ్చలు, ముడతలు, పొడిబారడం, స్కిన్ టోన్ మసకబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పబ్ మెడ్ సెంట్రల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యకరమైన చర్మానికి ఉదయం, రాత్రి ఒకసారి శుభ్రం చేస్తే మంచిది.

58


ఎక్కువగా పరిగెత్తడం 

రెగ్యులర్ గా ఉదయం పూట రన్నింగ్ కు వెళ్లడం వల్ల మీ మనసు, ఆరోగ్యం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. కేలరీలను బర్న్ చేయడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, ఎముకలను, కండరాలను సహజంగా బలంగా ఉంచడానికి రన్నింగ్ గొప్పగా సహాయపడుతుంది. కానీ పరిగెత్తే అలవాటు కూడా మీ అకాల వృద్ధాప్యానికి కారణమవుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ఆరోలోని మెడికల్ కంటెంట్ అండ్ ఎడ్యుకేషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం..  అధిక రన్నింగ్ మంటను కలిగిస్తుంది. అలాగే తప్పుడు ప్లేస్ లేదా తప్పుడు బూట్లతో పరిగెత్తడం వల్ల గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా శరీర బలహీనతకు కారణమవుతుంది. అలాగే ఫిట్నెస్ లక్ష్యాలను బలహీనపరుస్తుంది.

68

సన్‌బ్లాక్‌ను ఎక్కువగా ఉపయోగించడం 

చర్మ సమస్యలను నివారించడానికి సన్‌బ్లాక్ ఉత్తమ ఎంపిక. ఇది చర్మ క్యాన్సర్, ఫోటోగేజింగ్‌ను నివారించడానికి కూడా సహాయపడుతుంది. కానీ మీరు సన్‌బ్లాక్‌ని ఉపయోగించడం అలవాటు చేసుకుంటే.. మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సన్‌బ్లాక్ సూర్యకిరణాలకు గురికాకుండా చర్మ కణాలను కవర్ చేస్తుంది. కాగా సూర్యుడి నుంచి పొందే  సిర్కాడియన్ లయను నియంత్రించడానికి శరీరానికి విటమిన్ డి అవసరం. సూర్యకిరణాలకు పూర్తిగా దూరంగా ఉండటం వల్ల చర్మ సమస్యలతో పాటు అకాల వృద్ధాప్యానికి కూడా దారితీస్తుంది. 
 

78

Low-Carb Diet


కార్బోహైడ్రేట్లను నివారించడం 

ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి మన ఆహారంలో అన్ని పోషకాలు ఖచ్చితంగా ఉండాలి. కానీ చాలా మంది బరువు తగ్గడానికి పిండి పదార్థాలను పూర్తిగా నివారిస్తారు. కానీ ఈ అలవాటు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కార్బోహైడ్రేట్లను ఎక్కువ కాలం తినకపోవడం వల్ల గుండె జబ్బులతో పాటుగా క్యాన్సర్, సెరెబ్రోవాస్కులర్ వ్యాధులు వస్తాయని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ వెల్లడించింది.
 

88

carb

కార్బోహైడ్రేట్లు మన శరీరానికి, కణాలకు శక్తిని ఇవ్వడానికి చాలా అవసరమైన మాక్రోన్యూట్రియెంట్స్. ఫైబర్ వంటి కార్బోహైడ్రేట్లు దీర్ఘాయువుకు ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే మీరు తినే ఆహారంలో అవసరమైన అన్ని రకాల పోషకాలు ఉండేట్టు చూసుకోండి. 

Read more Photos on
click me!

Recommended Stories