బొంబాయి రవ్వ వెనక ఉన్న కథ...
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ తర్వాత.. ఎక్కువ మంది తినేది ఉప్మానే. అంతేకాదు.. ఇది తయారు చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. ఎక్కువ మందికి బ్రేక్ ఫాస్ట్ చేయాలన్నా, తక్కువ టైమ్ లో చేయాలన్నా.. అందరి ఆప్షన్ ఉప్మానే. ఇంట్లో అయినా, హోటల్ లో అయినా ఉప్మాని ఎక్కువగా బొంబాయి రవ్వతో తయారు చేస్తారు. అయితే, ఉప్మా రవ్వని బొంబాయి రవ్వ అని ఎందుకు పిలుస్తారు? దీని వెనక కారణం ఏంటి? అసలు, ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
బ్రిటీష్ కాలంలో భారతదేశంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ముంబయి అంత్యంత ముఖ్యమైనది. ఆ సమయంలో మహారాష్ట్ర, పరిసర ప్రాంతాల నుండి గోధుమలను పెద్ద ఎత్తున ప్రాసెస్ చేసే పరిశ్రమలు ముంబయి( ఆనాటి బాంబే) లోనే ఉండేవి. అక్కడ మిల్లుల్లో గోధుమలను లేదా మైదాను ప్రాసెస్ చేసేటప్పుడు వచ్చేదే ఈ సన్నని రవ్వ. బాంబేలని పెద్ద పెద్ద మిల్లుల నుంచి ఈ రకం రవ్వ దేశంలోని ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా దక్షిణ భారత దేశానికి ఎక్కువ దిగుమతి చేసేవారు.
నాటి కాలంలో టోకు వ్యాపారులు బాంబే నుండి వచ్చే ఈ ప్రత్యేక రకపు రవ్వ బస్తాలపై "Bombay Rava" అని ముద్రించి పంపేవారు. కాలక్రమేణా ప్రజలు నాణ్యమైన, తెల్లగా ఉండే ఈ సన్నని రవ్వని బొంబాయి రవ్వ అని పిలవడం అలవాటు చేసుకున్నారు.