Okra Vada: కరకరలాడే బెండకాయ వడలు.. ఒక్కసారి రుచి చూశారంటే అస్సలు వదలరు!

Published : Oct 19, 2026, 04:35 PM IST

Okra Vada: రెగ్యులర్‌గా తినే మసాలా వడలకు బదులు కాస్త వెరైటీగా ఏదైనా తినాలి అనుకుంటున్నారా? అయితే బెండకాయ వడలు ట్రై చేయాల్సిందే. చాలా తక్కువ టైంలో సింపుల్ గా చేసుకునే ఈ వడలను ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు. మరి ఆ వడల రెసిపీ తెలుసుకుందామా..

PREV
17
బెండకాయ వడ రెసిపీ

సాధారణంగా మనం ఇంట్లో శనగపప్పు వడ, మసాలా వడ లాంటివి చేసుకుని తింటుంటాం. కానీ ఎప్పుడైనా బెండకాయలతో వడలు ట్రై చేశారా? అయితే ఈ టేస్టీ ఈవినింగ్ స్నాక్ తయారు చేయాల్సిందే. బయట కరకరలాడుతూ, లోపల బెండకాయ రుచితో అదిరిపోయే ఈ వడను ఒక్కసారి ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేలా దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. వేడి వేడి టీతో పాటు తినడానికి, సాయంత్రం ఇంటికి వచ్చే చుట్టాలకు పెట్టడానికి ఈ వడలు పర్ఫెక్ట్. మరి వీటిని ఎలా చేయాలో చూద్దాం.

27
కావాల్సిన పదార్థాలు

శనగపప్పు - 1 కప్పు

బెండకాయలు - 8 నుంచి 10

పెద్ద ఉల్లిపాయ - 1

వెల్లుల్లి - 4 నుంచి 5 రెబ్బలు

అల్లం - 1 చిన్న ముక్క

పచ్చిమిర్చి - 2

ఎండుమిర్చి - 2 నుంచి 3

సోంపు - 1 టీస్పూన్

పసుపు - 1/4 టీస్పూన్

కరివేపాకు - కొద్దిగా

కొత్తిమీర - కొద్దిగా

ఉప్పు - తగినంత

నూనె - డీప్ ఫ్రైకి సరిపడా..

37
తయారీ విధానం

బెండకాయ వడల కోసం ముందుగా ఒక గిన్నెలో శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, సోంపు వేసుకోవాలి. అందులో తగినన్ని నీళ్లు పోసి సుమారు 3 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బెండకాయలను నీళ్లతో శుభ్రంగా కడిగి, తడి లేకుండా పొడి గుడ్డతో తుడుచుకోవాలి. ఆ తర్వాత వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బెండకాయల్లో తడి ఎక్కువగా ఉంటే వడ పిండి పల్చగా అయిపోతుంది కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడాలి.

47
శనగపప్పును మిక్సీ పట్టుకోవడం

నానబెట్టిన శనగపప్పులోని నీళ్లను పూర్తిగా వంపేయాలి. ఆ తర్వాత పప్పును మిక్సీ జార్‌లో వేసి బరకగా రుబ్బుకోవాలి. వడ పిండిలా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. నీళ్లు అస్సలు కలపకూడదు.

57
పిండి కలపడం

మిక్సీ పట్టుకున్న శనగ పిండిలో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చేత్తో ఈ పదార్థాలన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి.

67
డీప్ ఫ్రై చేయడం

స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి మీడియం మంట మీద వేడి చేయాలి. కలిపి పెట్టుకున్న పిండిని చిన్నచిన్న ఉండలుగా తీసుకుని, అరచేతిలో పెట్టుకుని వడల్లా ఒత్తుకోవాలి. నూనె వేడెక్కాక ఈ వడలను మెల్లగా అందులో వేయాలి. మీడియం మంట మీదే రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా, కరకరలాడేలా వేయించుకోవాలి. వడలను నూనె పీల్చే పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ లేదా టొమాటో సాస్‌తో సర్వ్ చేస్తే భలే రుచిగా ఉంటాయి.

77
బెండకాయ వడలు కరకరలాడాలంటే కొన్ని టిప్స్

బెండకాయల్లో తడి ఉండకూడదు: కడిగాక బాగా తుడిచి, ఆ తర్వాతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

పిండి మెత్తగా రుబ్బకూడదు: బరకగా రుబ్బుకుంటేనే వడలకు మంచి టెక్స్చర్, క్రిస్పీనెస్ వస్తాయి.

నీళ్లు కలపొద్దు: బెండకాయల్లో సహజంగానే జిగురు ఉంటుంది. కాబట్టి పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి.

నూనె వేడి చూసుకోవాలి: మరీ వేడిగా ఉన్న నూనెలో వేస్తే పైన త్వరగా రంగు మారిపోయి, లోపల ఉడకదు. కాబట్టి మీడియం మంట మీదే వేయించుకోవాలి.

చిన్న వడలుగా ఒత్తుకోవాలి: ఇలా చేయడం వల్ల వడలు లోపలి వరకు బాగా ఉడుకుతాయి.

ఈ వడ స్పెషాలిటీ ఏంటి?

శనగపప్పు రుచి, బెండకాయ టెక్స్చర్, సోంపు, ఎండుమిర్చి ఘాటు అన్నీ కలిసి ఈ వడను ఓ వెరైటీ ఈవినింగ్ స్నాక్‌గా మారుస్తాయి. రెగ్యులర్ మసాలా వడలకు బదులు దీన్ని చేసి మీ ఇంట్లో వాళ్లకు పెట్టండి, కచ్చితంగా ఇష్టపడతారు.

Read more Photos on
click me!

Recommended Stories