Sky in Blue: ఆకాశం ఎప్పుడూ నీలం రంగులోనే ఎందుకు ఉంటుంది? సూర్యోదయంలో ఎరుపు, నారింజ రంగులు ఎందుకు కనిపిస్తాయి?

Published : Sep 02, 2025, 11:59 AM IST

తలెత్తి ఆకాశం వైపు చూడండి. ఎప్పుడూ నీలం రంగులోనే కనిపిస్తుంది. అదే మేఘాలు ముదురు నీలం రంగులో ఉంటే ఆకాశం నలుపుగా కనిపిస్తుంది. ఆకాశంలో రంగుల వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్సు గురించి తెలుసుకోండి. 

PREV
15
ఆకాశం రంగు ఏమిటి?

నిర్మలంగా ఉన్న ఆకాశాన్ని చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. నిర్మలమైన ఆకాశం నీలం రంగులోనే ఉంటుంది. అదే ముదురు రంగులోకి మారిందంటే వర్షాలు వచ్చి పడతాయని అర్థం. ఆకాశం అసలు నీలం రంగులో ఎందుకు ఉంటుంది? ఇతర రంగుల్లో ఎందుకు ఉండదు? ఆకాశంలో ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. అవేవీ నీలం రంగులో ఉండవు.. కానీ ఆకాశం మాత్రం నీలం రంగులోనే ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో తెలుసుకోండి.

25
నీలం రంగులోనే ఎందుకు?

ఆకాశంలో నీలం రంగులో ఉండటం అనేది ప్రతిరోజు కనిపించే ఒక అందమైన దృశ్యం. అయితే నిజానికి ఆకాశంలో నీలం రంగులో ఉండే వస్తువులు ఏవి ఉండవు. సూర్యకాంతి భూమిలోని వాతావరణం కలిసి ఒక భ్రమను సృష్టిస్తుంది. దీన్నే ఆప్టికల్ ఎఫెక్ట్ అంటారు. తెల్లని సూర్యకాంతి భూ వాతావరణం లోనికి ప్రవేశించినప్పుడు అది గాలిలో ఉన్న నైట్రోజన్ ఆక్సిజన్ అణువులతో ఢీకొంటుంది. అలాంటి సమయంలోనే రంగుల ఆట మొదలవుతుంది. సూర్యకాంతిలో ఉండే అన్ని రంగులు కూడా వేర్వేరు తరంగధైర్ఘ్యాలను కలిగి ఉంటాయి. సూర్య కాంతిలో ఇంద్రధనస్సులో ఉన్న అన్ని రంగులు ఉంటాయి. కానీ చూసేందుకు మాత్రం అవి తెలుపు రంగులోనే ఉంటుంది. ఇక సూర్యకాంతిలో ఉండే నీలం, ఊదా కాంతి తక్కువ తరంగధైర్ఘ్యాలను కలిగి ఉంటాయి. ఎరుపు, నారింజ ఎక్కువ కాంతి తరంగధైర్ఘ్యాల కలిగి ఉంటాయి. ఈ కాంతులు గాలి అణువులతో ఢీకొన్నప్పుడు చిన్నచిన్న నీలం, ఊదా వంటి తరంగాలను వెదజల్లుతాయి. నీలి తరంగాలే ముఖ్యంగా ఎక్కువగా ఏర్పడతాయి. అందుకే ఆకాశం నీలం రంగులోనే కనిపిస్తుంది.

35
ఊదారంగులో ఎందుకు ఉండదు?

నీలం కంటే ఊదా రంగు తరంగధైర్ఘ్యాలను కలిగి ఉంటుంది. అయినా కూడా ఆకాశం ఊదా రంగులో కనిపించదు. నీలం రంగులోనే కనిపిస్తుంది. దీనికి సమాధానం మన కళ్ళలోనే ఉంది. మన కళ్ల నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. మనిషి కన్ను నీలం రంగును ఎక్కువగా గుర్తిస్తుంది. అదే ఊదా రంగును ఎక్కువగా గుర్తించలేదు. సూర్యుడు నీలి కాంతి కంటే తక్కువ తరంగధైర్ఘ్యాల కలిగిన ఊదా రంగు కాంతిని కూడా ఉత్పత్తి చేస్తాడు. కానీ నీలం రంగునే మన కళ్ళు చూడగలుస్తుంది.

45
నారింజ, ఎరుపు రంగులో ఎందుకు?

సూర్యుడు అస్తమించినప్పుడు లేదా ఉదయించినప్పుడు చూడండి. దాని కాంతి రంగు మారిపోతుంది. నీలం, ఊదా రంగులు కనిపించవు. ఎక్కువగా ఎరుపు నారింజరంగుల్లోనే కనిపిస్తుంది. దానికి కారణం సూర్యుడు అస్తమించేటప్పుడు లేదా ఉదయించేటప్పుడు సూర్య కాంతి భూవాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అప్పుడు నీలం, ఊదా తరంగాలు చెల్లాచెదురైపోతాయి. మన కంటిని చేరుకోలేవు. కానీ ఎక్కువ తరంగధైర్ఘ్యం కలిగిన ఎరుపు, నారింజ రంగులు మాత్రం మన కంటిని చేరుకోగలుగుతాయి. అందుకే ఉదయం సాయంత్రం పూట ఆకాశం ఎరుపు లేదా నారింజ రంగులో కనిపిస్తూ ఉంటుంది.

55
అందమైన ఆకాశం

ఆకాశం ఎన్నో నక్షత్రాలను, గ్రహాలను మాత్రమే కాదు రహస్యాలను కూడా దాచుకున్న అద్భుతమైన ప్రదేశం. ఇది ప్రకృతితో కలిసి అత్యంత అందమైన చిత్రాలను సృష్టిస్తుంది. మన కాలి కింద నేల... తలపై ఆకాశం అనేవి మన జీవితాల్ని ఎంతో అందంగా మారుస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories