Gold and Silver: మీరు బంగారం లేదా వెండి కొనేటప్పుడు దానిని జ్యూవెలరీ షాపు వారు ఒక గులాబీ రంగు కాగితంలో చుట్టి ఇవ్వడాన్ని గమనించే ఉంటారు. ఆ రంగు కాగితంలో ఎందుకు పెట్టి ఇస్తారో, దీని వెనక కారణం ఏంటో మీకు తెలుసా?
పెద్ద పెద్ద జ్యూవెలరీ షాప్ కి వెళ్లినప్పుడు, అక్కడ బంగారం, వెండి కొనుగోలు చేసినప్పుడు.. ఆ జ్యూవెలరీని ఆకర్షణీయంగా కనిపించే బాక్సుల్లో పెట్టి మనకు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఒకప్పుడు అలా కాదు.. ఏది కొన్నా... గులాబీ రంగు పేపర్ లో చుట్టి మరీ ఇచ్చేవారు. ఇప్పటికీ కొన్ని చిన్న జ్యూవెలరీ షాప్ వాళ్లు ఇలానే ఇస్తూ ఉంటారు? పింక్ కలర్ పేపర్ ని ఎందుకు వాడతారు అనే అనుమానం మీకు ఎప్పుడైనా కలిగిందా? ఈ సంప్రదాయం వెనక కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
24
పింక్ కాగితం వెనక సంప్రదాయం...
పింక్ పేపర్ లో బంగారం, వెండి ఆభరణాలు చుట్టడం కొత్త విషయం ఏమీ కాదు. ఈ ఆచారం చాలా సంవత్సరాలుగా ఉంది. కాశ్మీర్ నుంచి భారతదేశంలోని కన్యా కుమారి వరకు విలువైన వస్తువులను ఇతర వస్తువుల నుంచి వేరు చేసి జాగ్రత్తగా నిల్వ చేయడానికి గులాబీ రంగు కాగితం ఉపయోగించేవారు. ఏదైనా వస్తువును పింక్ కలర్ పేపర్ పెడితే అది చాలా ప్రత్యేకమైనది, విలువైనది నమ్మేవారు.
34
బంగారం, వెండి మెరుపు పెంచే పింక్ కాగితం...
మనం బంగారం, వెండి ఆభరణాలను ఎంతో ఖరీదు పెట్టి కొనుగోలు చేస్తాం. అవి కొన్న కొద్ది రోజులకే రంగు పోయినట్లు లేదా.. నల్లగా మారినట్లు కనిపిస్తే చాలా బాధగా ఉంటుంది. అయితే.... ఈ పింక్ కాగితంలో వాటిని చుట్టి ఉంచితే మాత్రం వాటి మెరుగు తగ్గదు. ముఖ్యంగా వెండి ఆభరణాలకు అయితే.. మెరుపును మరింత పెంచుతుంది. ఈ గులాబి రంగుకు బదులు.. వేరే రంగు పేపర్లు వాడితే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆభరణాల మెరుపు కోల్పోతాయి. అందుకే.. ఈ రంగు పేపర్ మాత్రమే వాడుతున్నారు.
గాలి , తేమ నుండి రక్షించడానికి... బంగారం, వెండి ఆభరణాలను కాగితంలో చుట్టారు. ఇది ఆభరణాలు చెడిపోకుండా నిరోధిస్తుంది. ఇది ఆభరణాల మెరుపును నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాదు... ఈ పేపర్ లో చుట్టడం వల్ల జ్యూవెలరీ మీద గీతలు పడటం, రాళ్లు ఊడటం లాంటివి కూడా జరగవు. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.