Lucky Plants For Home: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే పాజిటివ్ ఎనర్జీతో పాటు ధనలాభం!

Published : Sep 17, 2026, 06:05 PM IST

Lucky Plants For Home: ఇంట్లో మొక్కలు పెంచడాన్ని చాలామంది ఇష్టపడతారు. మీకు కూడా మొక్కలు పెంచే ఆసక్తి ఉంటే, అందంతో పాటు అదృష్టాన్ని తెచ్చే మొక్కలను ఎంచుకోవడం మంచిది. వాస్తు ప్రకారం ఇంట్లో ధన లాభం, పాజిటివ్ ఎనర్జీ పెంచే మొక్కలేంటో తెలుసుకుందాం.

PREV
16
అరెకా పామ్

వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లో ఉండటం మంచిదని పెద్దలు చెబుతుంటారు. అలాంటి వాటిలో అరెకా పామ్ ముందు వరుసలో ఉంటుంది. ఈ మొక్క పెద్ద పెద్ద గదులకు భలే సెట్ అవుతుంది. ఇది గదికి మంచి వెలుతురును, విశాలమైన లుక్‌ను ఇస్తుంది. ఎక్కువశాతం మంది ఈ మొక్కను లివింగ్ రూమ్‌లో లేదా కిటికీల దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుందని నమ్మకం.

26
లక్కీ బాంబూ

చాలామంది ఈ మొక్కను గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇష్టపడతారు. చిన్న టేబుల్స్ మీద పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ మొక్కను పెంచడానికి మట్టి కూడా అవసరం లేదు. ఇది ఎప్పుడూ ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఈ మొక్క పాజిటివ్ ఎనర్జీకి, అదృష్టానికి కేరాఫ్ అడ్రస్ గా వాస్తు నిపుణులు చెబుతున్నారు.

36
మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ ని పెంచడం చాలా ఈజీ. పెద్దగా కేర్ తీసుకోకపోయినా ఈ మొక్క చక్కగా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వానికి ప్రతీకగా నిలిచే ఈ మొక్క, ఏ ఇంటికైనా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అయితే మనీ ప్లాంట్‌ను ఇంట్లో సరైన దిశలో పెడితేనే పాజిటివ్ ఎనర్జీ, ఐశ్వర్యం పెరుగుతాయిని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మొక్కను ఆగ్నేయ దిశలో పెట్టాలని సూచిస్తున్నారు.

46
పీస్ లిల్లీ

వాస్తు ప్రకారం పీస్ లిల్లీ ఇంట్లో ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతాయని నమ్మకం. బెడ్‌రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో ఈ మొక్కను పెట్టవచ్చు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేందుకు ఈ మొక్క చక్కగా ఉపయోగపడుతుంది. ఇంటికి రాయల్ లుక్ ఇస్తుంది.

56
జేడ్ ప్లాంట్

వాస్తు ప్రకారం జేడ్ ప్లాంట్‌ను అదృష్టం, సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఇంటి మెయిన్ డోర్ దగ్గర లేదా ఆగ్నేయ దిశలో ఉంచితే పాజిటివ్ ఎనర్జీ, ఆర్థిక శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం. చిన్న, పచ్చని ఆకులతో అందంగా కనిపించే ఈ మొక్క ఇంటి అలంకరణకు చక్కగా సరిపోతుంది. కొత్త ఉద్యోగం, కొత్త బిజినెస్ మొదలుపెట్టే వాళ్లకు లేదా కొత్త ఇంటికి వెళ్లే వాళ్లకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఈ మొక్క సూపర్ ఆప్షన్.

66
స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ చాలా తక్కువ సంరక్షణతో పెరుగుతుంది. వాస్తు ప్రకారం స్నేక్ ప్లాంట్‌ను ఇంట్లో సరైన దిశలో ఉంచితే సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. సాధారణంగా తూర్పు, దక్షిణం లేదా ఆగ్నేయ దిశల్లో ఉంచడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంటి అందం, ప్రశాంతతను రెట్టింపు చేస్తుందని సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories