నెలసరి సమయంలో మహిళలు ఊరగాయలను ఎందుకు ముట్టుకోకూడదు.. ఒకవేళ ముట్టుకుంటే నిజంగానే పచ్చడి పాడవుతుందా?

Published : Jun 12, 2022, 01:25 PM ISTUpdated : Jun 12, 2022, 01:27 PM IST

పీరియడ్స్ కు సంబంధించిన అపోహలను మనం ఇప్పటికీ వింటూనే ఉన్నాం. అందులో ఒకటే నెలసరి సమయంలో మహిళలు ఊరగాయలకు (Pickles) దూరంగా ఉండాలని సలహానిస్తుంటారు. ఆ సమయంలో పచ్చళ్లను ముట్టుకుంటే అవి  చెడిపోతాయని నమ్ముతారు. ఇంతకి ఇందులో నిజమెంతుందో తెలుసుకుందాం పదండి.   

PREV
18
నెలసరి సమయంలో మహిళలు ఊరగాయలను ఎందుకు ముట్టుకోకూడదు.. ఒకవేళ ముట్టుకుంటే నిజంగానే పచ్చడి పాడవుతుందా?

పీరియడ్స్ సమయంలో.. మీ అమ్మమ్మ లేదా పెద్దలు ఊరగాయలను అస్సలు ముట్టుకోకూడదని మీకు చిన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తు ఉండే ఉంటాయి. దీనికి కారణం బహిష్టు సమయంలో ఊరగాయ డబ్బాను తాకితే అది చెడిపోతుందని నమ్ముతారు.
 

28
Pickle

ఇది మీ కథ మాత్రమే కాదు.. భారతదేశంలోని చాలా మంది మహిళలు ఈ రకమైన సంప్రదాయాన్ని ఎదుర్కొని ఉంటారు. ఒకసారి కాదు ఎన్నో సమయాల్లో.. బహిష్టు సమయంలో ఊరగాయల డబ్బాను తాకడం వల్ల ఆహారం అపవిత్రం అవుతుందని సాంప్రదాయకంగా నమ్ముతూ వస్తున్నారు. 

38

ఈ సాంప్రదాయం శతాబ్దాల నాటిది కావచ్చు. కానీ ఈనాటికీ కూడా ఊరగాయ లేదా పచ్చడిని ముట్టుకోవడం వల్ల అది అపవిత్రం అవుతుందని నమ్మే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఈ సంప్రదాయం వెనుక ఉన్న వాస్తవికత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

48

శతాబ్దాల నాటి నమ్మకాల ప్రకారం.. రుతుస్రావం సమయంలో మహిళలు వంటగదిలోకి ప్రవేశించడానికి లేదా ఊరగాయలను తాకడానికి వీలు లేకుండా ఉండే. ఈ సమయంలో వారు అపవిత్రంగా ఉంటారని, కాబట్టి తాకిన ప్రతిదీ అపవిత్రంగా మారుతుందని విశ్వసించారు. ఆసక్తికరమైన విషయమేమిట౦టే.. ఆహార౦ పవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి అపవిత్రమైనదేదీ ఆహారాన్ని ముట్టుకోకూడదని ప్రజలు నమ్మేవారు.

58

నేటికీ మన దేశంలోని వివిధ ప్రాంతాలలోని చాలా మంది మహిళలు వంటకు దూరంగా ఉంటారు. లేదా ఆ రోజుల్లో వంటగదిలోకి ప్రవేశించరు.  పీరియడ్స్ సమయంలో 4 నుంచి 5 రోజులు ఒంటరిగానే గడుపుతారు. నాల్గవ రోజు స్నానం చేసిన తరువాతే వారికి వంటగదిలోకి అనుమతి ఉంటుంది. 

68
pickle

కానీ పీరియడ్స్ నిజంగా ఆహారాన్ని ప్రభావితం చేస్తాయా? లేదా?  అన్న విషయాల గురించి సైన్స్ ఏమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..?

78

ఇది నిజమా; ? లేదా? ఇది కేవలం అపోహ మాత్రమేనా?

రుతుస్రావం సమయంలో.. అపరిశుభ్రమైన రక్తం శరీరం నుంచి బయటకు వస్తుంది. ఈ సమయంలో సంక్రామ్యత (Infection), వ్యాధులను (Diseases)వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో పరిశుభ్రత చాలా అవసరం అవుతుంది. ఇంతకు ముందైతే మహిళలు పీరియడ్స్ సమయంలో వస్త్రాన్ని ఉపయోగించేవారు. కానీ కాలక్రమేణా ఇప్పుడు వీరికి ఆరోగ్యకరమైన పాడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి సంక్రమణ అవకాశాలను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. 

88

ఒక సిద్ధాంత౦ ప్రకార౦.. అపరిశుభ్రమైన రక్త౦ స౦క్రమణ వ౦టివి ప్రమాదాలు ఎదురు కాకుండా ఉ౦డే౦దుకు, పరిశుభ్రతను దృష్టిలో ఉ౦చుకునే౦దుకు ఈ నియమాలు చేయబడ్డాయని నమ్ముతారు. అయితే కొ౦తమ౦ది స్త్రీలు మూడు రోజుల పాటు పనికి దూర౦గా ఉ౦డే౦దుకు.. వారికి పని ను౦చి విరామ౦ ఇవ్వడానికి అలా చేయబడి౦దని నమ్ముతారు. అందువల్ల ఈ సమయంలో ఊరగాయను తయారు చేయడానికి, తాకడానికి వీల్లేదంటారు. 

Read more Photos on
click me!

Recommended Stories