పెద్ద వయసు వారిలా కనిపిస్తారు: చాలా కాలంగా మీరు 6 గంటల కంటే తక్కువ రోజులు నిద్రపోతున్నట్టైతే.. మీ చర్మంపై ముడతలు, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, చర్మం ఉబ్బడం, స్కిన్ పై గీతలు, చర్మం పేలవంగా మారడం వంటి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంటే నిద్రలేమి వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కార్డిసాల్ రిలీజ్ అయ్యి కొల్లాజెన్ విచ్ఛిన్నం అవుతుంది. దీంతో చర్మం సాఫ్ట్ నెస్ ను కోల్పోతుంది. అలాగే చర్మం సాగుతుంది. ఇవన్నీ మీరు వయసు మళ్లిన వారిలా కనిపించేలా చేస్తాయి.