Breakup Food: బ్రేకప్ తర్వాత ఐస్‌క్రీమ్‌నే ఎక్కువగా తింటారంట..ఎందుకో తెలుసా?

Published : Sep 16, 2026, 03:13 PM IST

Breakup Food: బ్రేకప్ తర్వాత చాలా మందికి ఒంటరిగా ఉండాలనిపించడం, పాటలు వినడం, ఎవరితో మాట్లాడకుండా ఉండిపోతుంటారు. వీటితో పాటు మరో కామన్ పాయింట్ ఉంది. ఐస్ క్రీం తినడం. షాక్ అవుతున్నారా? దీన్ని బ్రేకప్ ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకో తెలుసా?

PREV
15
బ్రేకప్ తర్వాత ఐస్ క్రీం ఎందుకు తింటారు?

చేతిలో ఐస్‌క్రీమ్! సినిమాల్లోనూ, వెబ్‌సిరీస్‌లలోనూ బ్రేకప్ బాధలో ఉన్న వ్యక్తి ఐస్‌క్రీమ్ తింటూ కనిపించడం మనం ఎన్నోసార్లు చూసే ఉంటాం. దీంతో బాధలో ఉన్నప్పుడు ఐస్‌క్రీమ్ తినడం అనేది ఒక రకమైన కంఫర్ట్ ఫుడ్‌గా మారిపోయింది. అయితే బాధగా ఉన్నప్పుడు మనసు ఎందుకు ఐస్‌క్రీమ్ వైపు లాగుతుంది? దీనికి కారణం మెదడులో జరిగే కొన్ని ప్రక్రియలు, చిన్ననాటి జ్ఞాపకాలు అని నిపుణులు చెబుతున్నారు.

25
తీపి, కొవ్వు పదార్థాలు.. మెదడుకు రీఫ్రెష్ ని ఇస్తాయి

ఐస్‌క్రీమ్‌లో చక్కెర, కొవ్వు రెండూ ఉంటాయి. ఇవి మెదడులోని రివార్డ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేయడంలో పాత్ర పోషిస్తాయి. తీపి తిన్నప్పుడు డోపమైన్‌కు సంబంధించిన రివార్డ్ మార్గాలు స్పందించవచ్చు. దీంతో కొద్దిసేపైనా మనసు మారినట్టు, సంతృప్తిగా అనిపించవచ్చు. అందుకే ఆకలి లేకపోయినా.. బాధగా ఉన్న సమయంలో ఐస్‌క్రీమ్ తినాలనే కోరిక కలుగుతుంది. చల్లగా, క్రీమీగా ఉండే టెక్స్చర్ వల్ల మెదడుకు హాయినిస్తుంది.

35
ఐస్‌క్రీమ్‌పై యాడ్స్ ప్రభావం

చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఒక కారణమే

ఐస్‌క్రీమ్‌తో చాలామందికి చిన్నప్పటి నుంచే మంచి జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. పుట్టినరోజు, స్కూల్ సెలవులు, కుటుంబంతో బయటకు వెళ్లిన సందర్భాలు లేదా బాధగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొనిచ్చిన ఐస్‌క్రీమ్.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం ఉంటుంది. తర్వాత జీవితంలో ఒత్తిడి లేదా బాధ ఎదురైనప్పుడు.. ఆ ఫుడ్ గతంలోని అనుభూతులను గుర్తు చేయవచ్చు. అంటే మనం కేవలం ఐస్‌క్రీమ్ అనేది రుచి కోసమే కాదు...కంఫర్ట్ ఫీలింగ్.

ఐస్‌క్రీమ్‌పై ప్రకటనల ప్రభావం కూడా ఉంది

మనసు బాలేదా? ఏదైనా స్వీట్ తినండి అంటూ ఇలా చాలా యాడ్స్ చూస్తుంటాం. చాక్లెట్, ఐస్‌క్రీమ్ తో ఆనందం, రిలీఫ్, సెలబ్రేషన్‌తో యాడ్స్ వస్తుంటాయి. ఇలాంటి మార్కెటింగ్ యాడ్స్ పదేపదే కనిపించడం వల్ల..స్వీట్ ఫుడ్‌ వైపు వెళ్లాలనే ఆలోచన పెరుగుతుంది.

45
మహిళలు ఎమోషనల్ ఈటింగ్ వైపు ఎక్కువగా వెళ్తారా?

కొన్ని పరిశోధనలు మహిళలు ఒత్తిడి, బాధ లేదా ఇతర భావోద్వేగ పరిస్థితుల్లో ఫుడ్ వల్ల వాటి నుంచి బయటపడతారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదు. వ్యక్తిగత అలవాట్లు, లైఫ్ స్టైల్, పరిస్థితులు, ఆహారపు అలవాట్లు వంటి అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి.

55
ఐస్‌క్రీమ్ తింటే నిజంగానే మనసు మారుతుందా?

ఐస్‌క్రీమ్ తినగానే బాధ మొత్తం మాయమైపోతుందని చెప్పలేం. అయితే రుచికరమైన ఆహారం తినడం వల్ల మెదడులోని ఆనందం, రివార్డ్‌కు సంబంధించిన ప్రాంతాలు స్పందించవచ్చు. వెనిల్లా ఐస్‌క్రీమ్‌ను ఉపయోగించి గతంలో నిర్వహించిన బ్రెయిన్-ఇమేజింగ్ పరిశోధనల్లో.. రుచి, ఆనందం, భావోద్వేగ స్పందనలకు సంబంధించిన మెదడు ప్రాంతాల్లో కార్యకలాపాలు కనిపించాయని నివేదికలు సూచించాయి.

మరి బాధలో ఐస్‌క్రీమ్ తినకూడదా?

అలా కాదు. అప్పుడప్పుడు ఐస్‌క్రీమ్ తినడం తప్పేమీ కాదు. అయితే ప్రతి సారి బాధ, ఒత్తిడి లేదా ఒంటరితనాన్ని ఆహారంతోనే ఎదుర్కోవడం మాత్రం మంచి అలవాటు కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎమోషనల్‌గా డౌన్‌గా ఉన్నప్పుడు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం, బయట కొద్దిసేపు నడవడం, వ్యాయామం చేయడం, ఇష్టమైన హాబీల్లో సమయం గడపడం వంటి మార్గాలు కూడా ఉపయోగపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories