Clean Greasy Non-Stick Pan: నాన్‌స్టిక్ పాన్‌ను జాగ్రత్తగా వాడినా అంచుల చుట్టూ నూనె మరకలు, జిడ్డు పేరుకుపోతాయి. డిష్‌వాష్ తో కడిగినా జిడ్డు తొలగదు. గట్టిగా రుద్దితే నాన్‌స్టిక్ కోటింగ్ పోతుంది. అయితే కిచెన్‌లో దొరికే వస్తువులతో ఈజీగా క్లీన్ చేయొచ్చు.
నాన్‌స్టిక్ పాన్‌ను ఎంత జాగ్రత్తగా వాడినా వంట చేసిన తర్వాత అంచుల చుట్టూ నూనె, మరకలు, జిడ్డు పేరుకుపోతుంటాయి. సాధారణంగా డిష్‌వాష్ లిక్విడ్‌తో కడిగినా ఈ మొండి జిడ్డు తొలగదు. గట్టిగా రుద్దితే నాన్‌స్టిక్ కోటింగ్ పోతుంది. అందుకే కిచెన్‌లో దొరికే వస్తువులతోనే జిడ్డు క్లీన్ చేయొచ్చు.
25
ముందుగా గోరువెచ్చని నీటితో..
పాన్‌ను శుభ్రం చేసే ముందు అది పూర్తిగా చల్లారే వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత పాన్‌లో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో కొద్దిగా మైల్డ్ డిష్‌వాష్ లిక్విడ్ వేయాలి. మెత్తని స్పాంజ్ లేదా క్లాత్‌ను ఈ నీటిలో ముంచి పాన్ అంచుల చుట్టూ ఉన్న జిడ్డును మెల్లగా తుడవాలి.
జిడ్డు మరీ గట్టిగా పేరుకుపోయి ఉంటే.. పాన్‌ను 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ నీటిలో నానబెట్టవచ్చు. దీంతో అంచులకు అంటుకున్న జిడ్డు మెత్తబడుతుంది. ఆ తర్వాత మెత్తని స్పాంజ్‌తో తేలికగా తుడిస్తే సులభంగా తొలగిపోతుంది.
35
బేకింగ్ సోడాతో జాగ్రత్తగా..
గోరువెచ్చని నీటితో కడిగిన తర్వాత కూడా జిడ్డు అలాగే ఉంటే.. కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని అందులో నీళ్లు కలిపి పలుచని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జిడ్డు ఉన్న ప్రాంతంలో మాత్రమే అప్లై చేసి కొన్ని నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత మెత్తని స్పాంజ్ లేదా క్లాత్‌తో సున్నితంగా తుడవాలి. అయితే బేకింగ్ సోడాను వేసి గట్టిగా రుద్దకూడదు. ఎక్కువ ఒత్తిడితో స్క్రబ్ చేయడం వల్ల నాన్‌స్టిక్ కోటింగ్‌పై గీతలు పడే అవకాశం ఉంటుంది.
అంచుల దగ్గర జిగటగా ఉన్న ఫుడ్ తీసేయడానికి వైట్ వెనిగర్ కూడా వాడొచ్చు. సమానంగా వైట్ వెనిగర్, నీటిని కలిపి.. అందులో మెత్తని క్లాత్‌ను ముంచి పాన్ అంచులను తుడవాలి. అయితే వెనిగర్‌ను పాన్‌పై ఎక్కువసేపు అలాగే ఉంచకూడదు. తుడిచిన తర్వాత మైల్డ్ డిష్‌వాష్ లిక్విడ్‌తో పాన్‌ను మరోసారి శుభ్రంగా కడుక్కోవాలి.
55
స్టీల్ స్క్రబ్బర్ మాత్రం వద్దు..
జిడ్డు ఎంత గట్టిగా ఉన్నా స్టీల్ స్క్రబ్బర్‌తో రుద్దడం మంచిది కాదు. అలాగే చాలా గట్టిగా ఉండే క్లీనింగ్ ప్యాడ్స్, అబ్రేసివ్ పౌడర్లను కూడా ఉపయోగించకూడదు. ఇవి నాన్‌స్టిక్ కోటింగ్‌ను గీసే అవకాశం ఉంటుంది. మెత్తని స్పాంజ్, మైక్రోఫైబర్ క్లాత్ లేదా సాఫ్ట్ బ్రష్‌తోనే శుభ్రం చేయడం మంచిది.
చివర్లో ఇలా చేయండి..
జిడ్డు పూర్తిగా తొలగిన తర్వాత పాన్‌ను శుభ్రమైన నీటితో బాగా కడిగి.. పొడి కిచెన్ టవల్‌తో తుడవాలి. ముఖ్యంగా పాన్ అంచులు, రిమ్ దగ్గర నీరు లేదా ఫుడ్ మిగలకుండా చూసుకోవాలి. వంట చేసిన వెంటనే పాన్‌ను శుభ్రం చేస్తే జిడ్డు మందపాటి పొరగా పేరుకుపోకుండా ఉంటుంది. నాన్‌స్టిక్ పాన్‌ను గట్టిగా రుద్దకుండా.. గోరువెచ్చని నీరు, మైల్డ్ సోప్, మెత్తని క్లాత్‌తో క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే ఎక్కువకాలం మంచి కండిషన్‌లో ఉంచుకోవచ్చు.