చాలామందికి రాత్రి పడుకునేటప్పుడు బెడ్‌రూమ్ డోర్ తెరిచే ఉంచే అలవాటు ఉంటుంది. కానీ దానివల్ల మీ నిద్ర, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో మీకు తెలుసా? డోర్ మూసుకుని పడుకోవడం వల్ల కలిగే లాభాలేంటో, నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
మనం రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యం. కానీ పడుకునేటప్పుడు గది వాతావరణం ఎలా ఉండాలనే దానిపై చాలామందికి సందేహాలుంటాయి. ముఖ్యంగా, డోర్ తెరిచి ఉంచాలా లేక మూసేయాలా? అనే ప్రశ్నకు నిపుణులు ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తున్నారు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
25
మంచి నిద్ర కోసం..
నిద్రకు అనువైన వాతావరణం లేకపోతే చాలామందికి సరిగ్గా నిద్రపట్టదు. కొందరు పూర్తి చీకటిని ఇష్టపడితే, మరికొందరు నార్మల్ లైట్ వెలుతురులో పడుకుంటారు. కానీ మంచి నిద్ర, ఆరోగ్యం కోసం బెడ్‌రూమ్ డోర్ మూసి ఉంచడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
35
మెలటోనిన్ ఉత్పత్తి
చీకటిగా ఉన్న గదిలో 'మెలటోనిన్' (Melatonin) అనే హార్మోన్ బాగా విడుదలవుతుంది. ఇది మనం త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. డోర్ తెరిచి ఉంటే, బయటి వెలుతురు ఈ ప్రక్రియకు అడ్డుపడవచ్చు.
అంతేకాదు హాల్‌లో ఇతరులు మాట్లాడే శబ్దం లేదా టీవీ సౌండ్ బెడ్‌రూమ్‌లోకి రాకుండా ఉండాలంటే డోర్ మూయడం మంచిది. ఇది ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుంది. అలాగే డోర్ మూసి ఉండటం వల్ల ఏసీ లేదా ఫ్యాన్ గాలి పూర్తిగా గదిలోనే ఉంటుంది. గదిలో సుమారు 18°C నుంచి 22°C మధ్యలో ఉష్ణోగ్రత ఉంటే మంచి నిద్ర వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
55
నిద్రకు భంగం కలగకుండా..
సాధారణంగా పిల్లలు చిన్న చిన్న శబ్ధాలకే నిద్ర లేస్తుంటారు. కాబట్టి పిల్లలు పడుకున్నప్పుడు డోర్ మూయడం వల్ల ఇంట్లోని ఇతర శబ్దాలకు వారు పదేపదే మేల్కోకుండా ఉంటారు. అలాగే, పెంపుడు జంతువులు అర్ధరాత్రి గదిలోకి వచ్చి మీ నిద్రకు భంగం కలిగించకుండా నివారించవచ్చు.
ఒకవేళ మీ గదిలో కిటికీలు లేకపోయినా లేదా గాలి సరిగ్గా ప్రసరించని పరిస్థితి ఉన్నా, డోర్‌ను కొద్దిగా తెరిచి ఉంచవచ్చు. కానీ ప్రశాంతత, చీకటి కోసం మాత్రం డోర్ మూసేసి పడుకోవడమే ఆరోగ్యకరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.