Flights: అంటార్కిటికా ఖండంపై విమానాలు ఎందుకు ఎగరవు? ఎగిరితే ఏమవుతుంది?

Published : Jun 03, 2026, 10:06 AM IST

Flights: అంటార్కిటికా మీదుగా చాలా దేశాలకు దగ్గరి దారిలో వెళ్లిపోవచ్చు. కానీ ఫ్లైట్లు మాత్రం అంటర్కిటికా మీద నుంచి ఎగరవు.  పైలట్లు అంటార్కిటికా మీదుగా విమానాలను ఎందుకు నడపరు? దీని వెనకున్న అసలు కారణాలు ఇవే.

PREV
14
అంటార్కిటికాపై విమనాలు ఎందుకు ఎగరవు

భూమి మీద ఉన్న అన్ని ఖాండాల మీదుగా విమానలు స్వేచ్ఛగా, సురక్షితంగా ఎగురుతాయి.  భూ ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్ మీదుగా కూడా ప్రతిరోజూ వందల కొద్దీ కమర్షియల్ విమానాలు ప్రయాణిస్తాయి. కానీ, దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికాపై నుంచి  మాత్రం  విమానాలు ఎగరవు. ఈ ఖండంపై విమానాలు ఎందుకు ఎగరవు? ఎవరు వద్దన్నారు? ఎగిరితే ఏమవుతుంది? 

24
దగ్గరి దారైనా కూడా వెళ్లరు

ప్రపంచంలో ఏ మూలకైనా కొన్ని గంటల్లోనే విమానాల్లో వెళ్లిపోవచ్చు. వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేరడానికి షార్ట్ కట్ లలో పైలెట్లు విమానాలను నడిపిస్తారు. అలాగే దక్షిణార్ధ గోళంలోని కొన్ని దేశాల మధ్య ప్రయాణానికి అంటార్కిటికా మీదుగా చాలా దగ్గరి దారి ఉంది. కానీ కమర్షియల్ విమానాలు ఈ మంచు ఖండంపై నుంచి వెళ్లకుండా దూర మార్గాలనే ఎంచుకుని ప్రయాణం చేస్తాయి.

అంటార్కిటికా గురించి అందరికీ తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉంటాయి. విమానాలు ప్రయాణించే ఎత్తులో ఈ ఖండంలోని గాలి చాలా చల్లగా ఉంటుంది. ఈ విపరీతమైన చలి వల్ల విమానాల్లో వాడే జెట్ ఫ్యూయల్ గడ్డకట్టే ప్రమాదం ఉంది. అలా జరిగితే ఇంజిన్ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. దీని వల్ల విమానం కూలిపోవచ్చు.

34
పనిచేయని నావిగేషన్ వ్యవస్థ

ధ్రువ ప్రాంతాల్లో భూ అయస్కాంత క్షేత్రం చాలా శక్తివంతంగా ఉంటుంది. దీనివల్ల విమానాల్లోని నావిగేషన్ సిస్టమ్స్, దిక్సూచీలు సరిగా పనిచేయవు.  అంటార్కిటికాలో రాడార్ కనెక్టివిటీ, శాటిలైట్ కమ్యూనికేషన్ చాలా బలహీనంగా ఉంటాయి. ఒకవేళ పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో  సంబంధం కోల్పోతే విమానానికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు.

విమాన ప్రయాణంలో భద్రతే అన్నింటికంటే ముఖ్యం. ఒకవేళ ప్రయాణ సమయంలో ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చినా లేదా ప్రయాణికులకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, విమానాన్ని వెంటనే ఎక్కడో ఒకచోట ల్యాండ్ చేయాలి. కానీ అంటార్కిటికాలో వేల కిలోమీటర్ల వరకు కేవలం మంచు కొండలే ఉంటాయి. అక్కడ విమానం అత్యవసరంగా ల్యాండ్ చేసే అవకాశమే ఉండదు. 

44
అంతర్జాతీయ నిబంధనలు ఏం చెబుతున్నాయి

అంతర్జాతీయ విమానయాన సంస్థలు ETOPS (Extended-range Twin-engine Operational Performance Standards) అనే నియమాన్ని పాటిస్తాయి. దీని ప్రకారం రెండు ఇంజిన్లు ఉన్న విమానాలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అందుబాటులో ఉన్న విమానాశ్రయానికి నిర్దేశించిన దూరం కంటే ఎక్కువగా ప్రయాణించకూడదు. అంటార్కిటికా చుట్టుపక్కల ఎలాంటి ఎయిర్‌పోర్టులు లేవు కాబట్టి అక్కడ విమానాల రాకపోకలను నిషేధించారు. 'వైట్‌అవుట్' అనే భయంకరమైన వాతావరణ పరిస్థితి వల్ల పైలట్లకు భూమి ఎక్కడ ఉందో, ఆకాశం ఎక్కడ ఉందో తెలియని గందరగోళం ఏర్పడుతుంది. ఈ ప్రమాదాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రత కోసం అంటార్కిటికాపై నుంచి వెళ్లకుండా నిషేధం విధించాయి.

Read more Photos on
click me!

Recommended Stories