Coconut Shells: కొబ్బరి తీసేశాక ఆ కొబ్బరి చిప్పలను బయటపడేస్తున్నారా? వాటితో మీ ఇంటికి అవసరమైన ఎన్నో వస్తువులు తయారు చేసుకోవచ్చు. క్యాండిల్ హోల్డర్, ప్లాంటర్, బౌల్, వాల్ ఆర్ట్ వంటివి ఎన్నో చేసుకోవచ్చు.
ప్రతి ఇంట్లో కొబ్బరి కాయను వాడతారు. ఆ చిప్పలను పడేసే బదులు వాటితో అందమైన వస్తువులను తయారుచేయచ్చు. కొంచెం క్రియేటివిటీ చూపిస్తే కొబ్బరి చిప్పలతో అద్భుతమైన హోమ్ డెకార్ ఐటమ్స్ చేయవచ్చు. కొబ్బరి చిప్పలు మీ ఇంటికి యూనిక్ లుక్ ఇవ్వొచ్చు. కొబ్బరి చిప్పలతో ఎలాంటి వస్తువులు చేయవచ్చ ఇక్కడ చూడండి.
25
క్యాండిల్ హోల్డర్
కొబ్బరి చిప్పను శుభ్రం చేసి చుట్టూ ఉన్న పీచును బాగా నేలకేసి రుద్ది తీసేయాలి. కొబ్బరి చిప్పకు మీకు నచ్చిన రంగు, డిజైన్లు వేసుకోవచ్చు. అందులో చిన్న క్యాండిల్ పెడితేక్యాండిల్ హోల్డర్ రెడీ అవుతుంది. ఇది మీ లివింగ్ రూమ్ లేదా బాల్కనీకి ఎంతో అందాన్ని ఇస్తుంది.
35
అందమైన ప్లాంటెర్
గార్డెనింగ్ ఇష్టమైతే కొబ్బరి చిప్పతో అద్భుతమైన మినీ ప్లాంటర్ మార్చుకోవచ్చు. ఇందులో మనీ ప్లాంట్ లేదా సక్యులెంట్స్ వంటి చిన్న మొక్కలు పెట్టి తాడుతో వేలాడదీయాలి. ఇది మీ ఇంటికి అందమైన లుక్ ఇస్తుంది.
కొబ్బరి చిప్పను బాగా పాలిష్ చేసి దాన్ని ఒక బౌల్‌గా వాడొచ్చు. ఇందులో డ్రై ఫ్రూట్స్, పువ్వులు వంటివి వేసుకోవచ్చు. దీన్ని టేబుల్ పై అందంగా పెట్టుకోవచ్చు.
55
వాల్ హ్యాంగింగ్
కొంచెం ఆర్ట్ నైపుణ్యం మీకుంటే కొబ్బరి చిప్పలను వాల్ డెకార్‌గా మార్చుకోవచ్చు. దీనిపై పెయింటింగ్, అద్దాల పని లేదా దారాలతో యూనిక్ వాల్ హ్యాంగింగ్స్ చేసుకోవచ్చు. ఇది మీ ఇంటి గోడలకు ఎంతో ఎస్తెటిక్ లుక్ ఇస్తుంది.