Hair color
తెల్ల వెంట్రుకలు ఉన్న వారే కాదు.. ఈ రోజుల్లో యువత కూడా హెయిర్ కలర్ ను వాడుతున్నారు. హెయిర్ కలరింగ్ అనేది ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి ఫ్యాషన్ స్టేట్ మెంట్ గా మారిపోయింది. తెల్ల జుట్టును దాచుకోవడానికి మాత్రమే కాదు.. సరికొత్తగా కనిపించాలని చాలా మంది రకరకాల రంగులను జుట్టుకు వేసుకుంటున్నారు.
దీనికోసం కొంతమంది బాగా ఖర్చు కూడా చేస్తుంటారు. కానీ చాలా సార్లు ఈ హెయిర్ కలర్ చాలా తొందరగా పోతుంది. దీంతో తిరిగి మీ జుట్టు దాని సహజ రూపానికి వస్తుంది.
నిజానికి కొన్ని పొరపాట్ల వల్లే హెయిర్ కలర్ తొందరగా పోతుందని నిపుణులు అంటున్నారు. హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత మీ జుట్టును సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. అసలు జుట్టుకున్న రంగు త్వరగా పోవడానికి కారణాలు, ఇలా జరగకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రెగ్యులర్ షాంపూల వాడకం
హెయిర్ కలర్ ను వేసుకున్న తర్వాత మీ జుట్టును సరిగ్గా చూసుకోకపోవడం వల్లే జుట్టుకున్న రంగు పోతుంది. అయితే హెయిర్ కలర్ ను వాడిన వారు కలర్ ప్రొటెక్టింగ్ షాంపూ అనే ప్రత్యేక రకం షాంపూను ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే ఈ షాంపూ హెయిర్ కలర్ ను తొలగించదు.
అదే మీరు రెగ్యులర్ గా వాడిన షాంపూతో తలస్నానం చేస్తే మాత్రం మీరు జుట్టుకు రంగు వేసుకున్నా లాభం ఉండదు. ఇది రంగు పోయేలా చేస్తుంది. కాబట్టి జుట్టు రంగు ఎక్కువ కాలం ఉండాలంటే రెగ్యులర్ షాంపూలకు బదులుగా కలర్ ప్రొటెక్టింగ్ షాంపూలను వాడండి.
వేడి నీళ్లతో తలస్నానం
జుట్టుకున్న రంగు పోకూడదంటే మీరు వేడి నీళ్లతో తలస్నానం అస్సలు చేయకూడదు. ఎందుకంటే వేడి నీళ్ల వల్ల మీ జుట్టు దెబ్బతింటుంది. అంతేకాదు జుట్టుకేసుకున్న రంగు కూడా త్వరగా మసకబారుతుంది.అందుకే తలస్నానానికి వేడి నీళ్లను ఉపయోగించండి. నార్మల్ లేదా గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు.
రంగుతో ఎక్కువ సేపు ఉండటం
చాలా మంది జుట్టుకు రంగు వేసుకున్న తర్వాత స్నానం చేయకుండా చాలా సేపటి వరకు అలాగే ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది మీ జుట్టును దెబ్బతీస్తుంది. రంగులో ఉండే కొన్ని పదార్థాలు మీ జుట్టు దెబ్బతినేలా చేస్తాయి.
అందుకే ప్యాకెట్ పై ఉన్న సమయాన్ని బట్టి వెంట్రుకలకు రంగు ఉండేలా చూసుకోవాలి. మీ జుట్టు రంగు ముదురు రంగులో ఉండాలనుకుంటే అలాంటి కలర్ ను వాడండి. కానీ ఎక్కువ సమయం మాత్రం స్నానం చేయకుండా ఉండకండి.
హెయిర్ స్ట్రెయిటెనర్లు
జుట్టుకు రంగును వేసిన తర్వాత కొన్ని పనులు చేయకూడదు. ముఖ్యంగా స్ట్రెయిటెనర్లు లేదా కర్లర్లు వంటి తాపన సాధనాలను ఉపయోగించడం మానుకోవాలి. జుట్టుకు రంగు వేసిన తర్వాత వీటిని వాడితే మీ జుట్టు బాగా దెబ్బతింటుంది. ఎందుకంటే ఈ సాధనాలు మీ జుట్టుకున్న రంగు మసకబారడానికి కూడా కారణమవుతాయి.
అందుకే ఈ సాధనాలను ఉపయోగించినప్పుడల్లా ముందుగా మీ జుట్టుకు హీట్ ప్రొటెక్టర్ ను అప్లై చేయండి. ఇది ఒక రకమైన లోషన్. ఇది తాపన సాధనాల వల్ల కలిగే నష్టం నుంచి మీ జుట్టును రక్షిస్తాయి.
తప్పుడు రంగును ఉపయోగించడం
జుట్టుకు రంగును వేసుకునే ముందు మీ ముఖానికి ఏ రంగు బాగుంటుందో చూసుకోండి. తప్పుడు రంగును వేసుకుంటే మీ లుక్ చెడిపోతుంద. అందుకే హెయిర్ కలర్ ఎంచుకునే ముందు మంచి హెయిర్ స్టైలిస్ట్ ను సంప్రదించండి.