Aluminium Foil Safety: చపాతీలు, రోటీలను సిల్వర్ ఫాయిల్ లో చుడుతున్నారా? ఇది సేఫేనా?

Published : Oct 15, 2026, 07:20 PM IST

Aluminium Foil Safety: చపాతీలు, రోటీలు చల్లారిపోకుండా చాలా మంది అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి పెడుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనా? ఎలాంటి ప్రభావం పడుతుంది. ఫాయిల్ వాడే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

PREV
15
అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టిన ఆహారం

మనం ఆఫీస్, స్కూల్ లేదా కాలేజీకి తీసుకెళ్లే టిఫిన్ బాక్సుల్లో చపాతీలు, రోటీలను అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి పెడుతుంటాం. హోటల్స్ లో కూడా వాటిని చుట్టి ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల మధ్యాహ్నం లేదా రాత్రి వరకు అవి వేడిగా, మెత్తగా ఉంటాయి. అయితే, ఈ అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టిన ఆహారం మన ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితం.?

25
వేడివేడిగా ఉన్నప్పుడు చుట్టకండి
రోటీలు, చపాతీలు పొయ్యి మీద నుంచి దించగానే వేడివేడిగా ఉన్నప్పుడు అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టడం మంచిది కాదు. మీరు వేడి ఆవిరితో ఉన్నప్పుడే చుట్టేస్తే, ఆ ఆవిరి నీరు ఫాయిల్ లోపల ఉండిపోతుంది. ఆ నీరు రోటీలు లేదా చపాతీల మీద పడి అవి జిగటగా మారుతాయి.
35
పుల్లటి ఆహారాలకు ఫాయిల్ వాడొద్దు

రోటీలు, చపాతీలకు అల్యూమినియం ఫాయిల్ వాడినా పర్వాలేదు. కానీ ఉప్పు, పులుపు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఇందులో చుట్టడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆహారంలోని ఉప్పు, పులుపు అల్యూమినియం ఫాయిల్‌తో కలిసినప్పుడు కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దీనివల్ల ఆహారంలో అల్యూమినియం స్థాయిలు సహజం కంటే ఎక్కువగా పెరుగుతాయి. ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

45
మైక్రోవేవ్‌లో ఫాయిల్ పెట్టొచ్చా?

చపాతీలు లేదా ఇతర పదార్థాలను అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి మైక్రోవేవ్‌లో వేడి చేయొచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. దీనికి సమాధానం ‘చేయకూడదు’. అమెరికా భద్రతా సంస్థ ఈ విషయంపై ఒక ముఖ్యమైన సూచన చేసింది. అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టిన ఆహారాన్ని మైక్రోవేవ్‌లో పెట్టడం చాలా ప్రమాదకరం అని ఆ సంస్థ హెచ్చరించింది.

55
రోజూ ఫాయిల్ వాడటం మంచిదేనా?
మీరు ప్రతిరోజూ టిఫిన్ బాక్సుల్లో ఆహారాన్ని తీసుకెళ్లడానికి అల్యూమినియం ఫాయిల్ వాడటం ఏమాత్రం సురక్షితం కాదు. ఇలా రోజూ వాడటం వల్ల కొద్ది మొత్తంలో అల్యూమినియం ఆహారంలో కలిసి మన శరీరంలోకి చేరుతుంది. మన శరీరానికి సహజంగా కావాల్సిన దానికంటే ఈ అల్యూమినియం స్థాయిలు పెరిగితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Read more Photos on
click me!

Recommended Stories