Soaking rice: అన్నం వండే ముందు బియ్యం ఎందుకు నానబెట్టాలి?

Published : Dec 25, 2025, 01:37 PM IST

Soaking rice: అన్నం వండే ముందుకు ఎవరూ బియ్యాన్ని నానబెట్టరు. నిజానికి బిర్యానీ వండే ముందు బాస్మతీ రైస్ నానబెట్టినట్టే.. బియ్యాన్ని కూడా నానబెట్టాలి. ఎందుకు నానబెట్టాలో తెలుసుకోండి. 

PREV
14
అన్నం ఎలా వండాలి?

మన ఆహారంలో బియ్యానికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. ఎందుకంటే దోసె నుంచి రాత్రి భోజనం వరకు బియ్యం కచ్చితంగా ఉండాల్సిందే. అయితే మన పెద్దలు బియ్యం వండే ముందు కొంతసేపు నీళ్లలో నానబెట్టే అలవాటు పాటించేవారు. ఇది కేవలం రుచికోసం లేదా అలవాటుగానో కాదు.. ఆరోగ్యకరమైన పద్దతి కాబట్టి. ఆధునిక జీవనశైలిలో చాలామంది తొందరపాటుతో నేరుగా బియ్యం కడిగి వండేస్తున్నారు. కానీ బియ్యాన్ని నీళ్లలో నానబెట్టడం వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.

24
బియ్యం ఎందుకు నానబెట్టాలి?

బియ్యాన్ని నీళ్లలో నానబెట్టినప్పుడు అందులో ఉండే ఫైటిక్ ఆమ్లం స్థాయి తగ్గుతుంది. ఈ ఫైటిక్ ఆమ్లం శరీరానికి అవసరమైన ఇనుము, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు శరీరంలో శోషించబడకుండా అడ్డుకుంటుంది. నానబెట్టడం వల్ల ఈ అడ్డంకి కొంత తగ్గుతుంది. దాంతో శరీరం అవసరమైన ఖనిజాలను సులువుగా గ్రహించగలుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఇది చాలా ప్రయోజనకరం. ఎముకల బలం పెరగడం, రక్తహీనత సమస్యలు తగ్గడం వంటి లాభాలు కనిపిస్తాయి. అంతేకాదు, నానబెట్టిన బియ్యం జీర్ణక్రియకు కూడా సులభంగా మారుతుంది. కడుపు మంట, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఉన్నవారికి ఇది ఉపశమనంగా ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు.

34
వంట సులువవుతుంది

బియ్యం నానబెట్టడం వంట ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుంది. నీళ్లలో నానబెట్టిన బియ్యం ముందుగానే కొంత మృదువుగా మారతాయి. దాంతో వండే సమయంలో అవి సమానంగా ఉడుకుతాయి. అన్నం పొత్తికడుపు పట్టకుండా, విడివిడిగా, మృదువుగా తయారవుతుంది. రుచి కూడా మెరుగ్గా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వండే సమయం తగ్గుతుంది. గ్యాస్ లేదా ఇంధనం వినియోగం తగ్గడం వల్ల ఖర్చు కూడా కొంత ఆదా అవుతుంది. ఆధునిక కాలంలో ఇది చిన్న విషయం అనిపించినా, దీర్ఘకాలంలో ఇది మంచి అలవాటుగా మారుతుంది. ముఖ్యంగా రోజూ అన్నం వండే కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరమైన పద్ధతిగా చెప్పుకోవచ్చు.

44
ఈ జాగ్రత్తలు తప్పవు

అయితే బియ్యం నానబెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. ఎక్కువసేపు నీళ్లలో ఉంచితే కొన్ని పోషకాలు నీళ్లలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణంగా అరగంట నుంచి రెండు గంటల వరకు నానబెట్టడం సరిపోతుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఎక్కువసేపు ఉంచకుండా జాగ్రత్త పడాలి. నానబెట్టిన నీటిని పారబోసి, శుభ్రమైన నీటితో వండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే, బియ్యం నానబెట్టడం మన పూర్వీకులు పాటించిన ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయం. ఆధునిక శాస్త్రం కూడా దీనిని సమర్థిస్తోంది. రోజువారీ ఆహారంలో చిన్న మార్పు చేసినా, దీర్ఘకాలంలో అది మంచి ఆరోగ్య ఫలితాలను ఇస్తుంది. అందుకే తొందరపాటు వదిలి, బియ్యం వండే ముందు కొంతసేపు నీళ్లలో నానబెట్టే అలవాటు చేసుకోవడం అందరికీ మేలు చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories