డీ హైడ్రేషన్...
వేసవిలో శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల గొంతు, ముక్కులోని శ్లేష్మ పొరలు పొడిబారిపోతాయి. ఇది వైరస్లు శరీరంలోకి ప్రవేశించడానికి మార్గం సులువు చేస్తుంది.
ప్రయాణాలు, రద్దీ ప్రాంతాలు: వేసవి సెలవుల్లో చాలామంది ట్రిప్స్ వెళ్తుంటారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల ప్రజలతో కలిసిపోవడం వల్ల వైరస్లు సులభంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతాయి.
గాలిలో ఉండే అలర్జీలు : వేసవిలో గాలిలో తిరిగే పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి వల్ల శ్వాసకోశ మార్గంలో చికాకు ఏర్పడుతుంది. ఇది జలుబు లక్షణాలను పోలిన సమస్యలను సృష్టిస్తుంది.
నివారణ మార్గాలు:
ఎండ నుంచి నేరుగా వచ్చి వెంటనే ఏసీలో కూర్చోవడాన్ని తగ్గించాలి.
శరీరం హైడ్రేటెడ్గా ఉండేలా తగినన్ని నీళ్లు తాగాలి.
చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడగడం ద్వారా వైరస్ల బారి నుంచి రక్షించుకోవచ్చు.