Garlic: మొలకలు వచ్చిన వెల్లుల్లి తినొచ్చా? తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?

Published : Oct 14, 2026, 08:24 AM IST

Garlic: ఉల్లిపాయలు లాగానే వెల్లుల్లి కి కూడా మొలకలు వస్తూ ఉంటాయి. మరి, మొలకెత్తిన వెల్లుల్లి తినాలా? తినకూడదా? తింటే ఏం జరుగుతుంది? ఆరోగ్యానికి మంచిదా? లేక ఆరోగ్య సమస్యలు వస్తాయా?

PREV
13
మొలకెత్తిన వెల్లుల్లి...

వంట గదిలో వెల్లుల్లి లేకుండా ఏ కూర రుచి కూడా పూర్తి కాదు. కూరలు, పప్పులు, చట్నీలు, నాన్ వెజ్ వంటకాలు.. ఇలా ప్రతిదాంట్లోనూ విరివిగా వాడతాం. అయితే, ఒకేసారి ఎక్కువ వెల్లుల్లి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు... కొన్ని రోజులకు వెల్లుల్లి నుంచి మొలకలు రావడం మొదలౌతాయి. చాలా మంది మొలకలు రాగానే వెల్లుల్లి పారేస్తూ ఉంటారు. మొలకలు వచ్చిన వెల్లుల్లి తినొచ్చా? తినకూడదా? అసలు వెల్లుల్లి పాడైందో లేదో ఎలా తెలుస్తుంది?

23
మొలకెత్తిన వెల్లుల్లి తినొచ్చా..?

మొలకలు వచ్చిన వెల్లుల్లి తినకూడదు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ, వీటిని తినవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వెల్లుల్లి రెబ్బల నుంచి మొలకలు వచ్చినా... అది గట్టిగా ఉండి, ఎలాంటి దుర్వాసన రాకపోతే.. వాటిని మనం వంటలో వాడుకోవచ్చు. మొలక రావడం అంటే ఆ వెల్లుల్లి రెబ్బలో కొత్త మొక్క పెరుగుదల ప్రారంభమైందని అర్థం అంతేగానీ అది విషపూరితమైందని కాదు. అయితే మొలకలు రావడం వల్ల వెల్లుల్లి రుచిలో కొద్దిగా తేడా రావచ్చు. వెల్లుల్లి ఘాటు, రుచి తగ్గిపోతుంది.

మొలకెత్తిన వెల్లుల్లి లో పోషకాలు తగ్గిపోతాయా?

వెల్లుల్లి మొలకెత్తే క్రమంలో దానిలోని కొన్ని రసాయన సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్ స్థాయిలు మారుతుంటాయి. మొలకెత్తిన వెల్లుల్లిలో కొన్ని యాంటీఆక్సిడెంట్లు పెరుగుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అలాగని మొలకెత్తిన వెల్లుల్లి మాత్రమే అన్ని విధాలా ఆరోగ్యకరమైనదని భావించలేం. అలాగే మొలకలు వచ్చేశాయని అందులోని పోషకాలన్నీ పూర్తిగా నశించిపోతాయని అనుకోవడం కూడా పొరపాటే.

33
పాడైన వెల్లుల్లిని ఎలా గుర్తించాలి?

మొలకలు రావడం వేరు, వెల్లుల్లి పాడైపోవడం వేరు. ఈ రెండింటిని ఎప్పుడూ ఒకేలా చూడకూడదు. వెల్లుల్లి రెబ్బలను పరిశీలించినప్పుడు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే మాత్రం వాటిని అస్సలు వాడకూడదు:

మెత్తగా మారడం: తాజా వెల్లుల్లి రెబ్బ గట్టిగా ఉంటుంది. అదే నొక్కగానే మెత్తగా అనిపించినా, లోపల కుళ్లినట్లు ఉన్నా వాటిని పక్కన పెట్టేయాలి.

బూజు పట్టడం: వెల్లుల్లిపై తెల్లటి, ఆకుపచ్చ లేదా నలుపు రంగులో బూజు కనిపిస్తే ఆ వెల్లుల్లిని పూర్తిగా పారేయాలి. బూజు ఉన్న భాగాన్ని కట్ చేసి మిగతాది వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు.

దుర్వాసన: వెల్లుల్లికి సహజమైన ఘాటైన వాసన ఉంటుంది. కానీ పుల్లగా, కుళ్లిన వాసన లేదా వికారమైన దుర్వాసన వస్తే వాటిని ఉపయోగించకండి.

తడిగా, జిగురుగా మారడం: రెబ్బలపై అసాధారణమైన తేమ, జిగురు లేదా కుళ్లిన ద్రవం ఉంటే అవి పాడైపోయినట్లే లెక్క.

రంగు మారడం: రెబ్బ లోపల గోధుమ లేదా నల్లటి మచ్చలు కనిపిస్తే జాగ్రత్తగా పరిశీలించాలి. కేవలం రంగు కొద్దిగా మారిందనే కారణంతో కాకుండా, బూజు, మెత్తదనం వంటి ఇతర లక్షణాలను కూడా బేరీజు వేసుకోవాలి.

వెల్లుల్లిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచే చిట్కాలు: గాలి ఆడే ప్రదేశం: వెల్లుల్లిని ఎప్పుడూ పొడిగా, గాలి బాగా ప్రసరించే ప్రదేశంలో ఉంచాలి. ప్లాస్టిక్ సంచుల్లో ఎక్కువ కాలం ఉంచితే తేమ చేరి పాడవుతాయి.

తేమకు దూరం: కడిగిన వెల్లుల్లిని నిల్వ చేయవద్దు. ఒకవేళ తడి ఉంటే పూర్తిగా ఆరిన తర్వాతే నిల్వ చేయాలి.

సూర్యరశ్మి, వేడికి దూరం: వంటగదిలో పొయ్యి పక్కన లేదా వేడిగా ఉండే చోట కాకుండా చల్లని, పొడి ప్రదేశంలో ఉంచడం మంచిది. వీలైనంత వరకు పొట్టు తీయకుండా మొత్తం వెల్లుల్లి గడ్డలను అలాగే ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రమే రెబ్బలను విడదీయాలి.

Read more Photos on
click me!

Recommended Stories