heart attack: ఇలా స్నానం చేస్తే గుండెపోటు రావడం ఖాయం..!

First Published May 12, 2022, 12:28 PM IST

heart attack: స్నానం చేసేటప్పుడే చాలా మంది గుండెపోటు లేదాస్ట్రోక్ బారిన పడుతుంటారు. దీనికి అసలు కారణమేంటో తెలుసా..? 
 

heart attack

heart attack: ప్రస్తుత కాలంలో గుండెపోటు కారణంగా మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. దీనికి అసలు కారణం మారుతున్న జీవన శైలి, ఒత్తిడి, పోషకలేమి ఆహారపు అలవాట్ల వంటి కారణాల వల్ల గుండెపోటు ఎక్కువగా వస్తుంది. అంతేకాదు స్నానం చేసే పద్దతి సరిగ్గా లేకున్నా గుండె పోటు ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనం వెల్లడిస్తోంది. 

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి.. కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె కొట్టుకోవడం ఆపివేసే పరిస్థితి. ఇది సంభవించినప్పుడు శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్ నిండిన రక్తం సరఫరా కాదు. దీంతో ప్రాణాలు కోల్పోవచ్చు. కొంతమంది కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ మరియు హార్ట్ ఫెయిల్యూర్ అనే పదాలను ప్రత్యమ్నాయాలుగా ఉపయోగిస్తారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి కొంచెం భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ ఇవి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. 

సాన్నం చేసేటప్పుడు పక్షవాతం, గుండెపోటు రావడానికి ప్రధాన కారణం స్నానం సరైన పద్దతిలో చేయకపోవడమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పటికే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న రోగుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంతకు స్నానం ఎలా చేస్తే గుండెపోటు వస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

సాధారణంగా చల్లని నీళ్లతో స్నానం చేసినప్పుడు మాత్రమే ఈ సమస్య వస్తుంటుంది. ఇలా కావడానికి ప్రధాన కారణం స్నానం చేసేటప్పుడు నేరుగా తలపై నీటిని పోయడం వల్ల స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. 
 

స్నానం చేయడానికి సరైన మార్గం ఏమిటంటే మొదట కాళ్లపై, ఆ తర్వాత నడుము, మెడ, చివరగా తలపై నీళ్లను పోయాలి. చల్లని నీళ్లను నేరుగా తలపై పోయడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ముఖ్యంగా నీరు మరీ చల్లగా ఉంటే.. అది కేశనాళిక సిరలు కుంచించుకుపోయేలా చేస్తుంది. అలాగే రక్తపోటు కూడా ఉన్నట్టుండి బాగా పెరుగుతుంది.
 

స్నానం చేయడం వల్ల స్ట్రోక్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది?.. రక్త ప్రసరణ తల నుండి కాలి వరకు జరుగుతుంది. తలపై చల్లని నీరు పడిన వెంటనే రక్త నాళాలు సంకోచించబడతాయి. దీంతో రక్త ప్రసరణ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇది స్ట్రోక్ మరియు హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే రక్తం గుండెకు సరిగ్గా చేరదు. చాలాసార్లు, చల్లని నీరు పడిన వెంటనే మెదడు నరాలు పగిలిపోతాయి. బాత్రూమ్ లో స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. 
 

స్నానం చేయడానికి సరైన మార్గం ఏమిటి? స్నానం చేయడానికి మగ్గును ఉపయోగించాలి. ముందుగా మీ పాదాలపై నీటిని పోయండి. ఇది నీటి ఉష్ణోగ్రత గురించి శరీరానికి తెలిసేలా చేస్తుంది. షాక్ అవ్వదు. నెమ్మదిగా పాదాల తరువాత నీటిని పైకి పోయాలి. చివరగా, మీ తలపై నీటిని పోయండి. ఇది మెదడుకు షాక్ ఇవ్వదు మరియు రక్త ప్రసరణ సాధారణంగా ఉంటుంది.

click me!