‘సర్కారువారి పాట’ కళావతి.. కీర్తి సురేష్ బ్యూటీ సీక్రెట్స్ ఇవే...

Published : May 12, 2022, 12:15 PM IST

సౌత్ ఇండియా సినిమా సెన్సేషనల్ స్టార్ కీర్తీ సురేష్. ‘మహానటి’ సినిమాలో నటనతో భాషాబేధం లేకుండా కోట్లాదిమంది అభిమానుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘సర్కార్ వారి పాట’ సినిమాలో జతకట్టింది.

PREV
110
‘సర్కారువారి పాట’ కళావతి.. కీర్తి సురేష్ బ్యూటీ సీక్రెట్స్ ఇవే...

అందానికి మారుపేరులా ఉండే కీర్తి సురేష్.. ముద్దుగా, బొద్దుగా బొండుమల్లెలా ఉండే కీర్తి ఇటీవల సన్నబడి సన్నజాజిలా తయారయ్యింది. 

210
keerthy suresh

చురుక్కుమనే చూపులతో.. మెస్మరైజ్ చేసే నవ్వుతో.. మెరిపించే కీర్తి సురేష్ అందానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అవేంటో చూడండి.

310
Keerthy suresh

ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే కీర్తి సురేష్.. రాత్రి ఎంత లేటైనా, ఎంత బిజీగా ఉన్నా తన CTS రొటీన్ ను తప్పదు. CTS అంటే ఏంటో కాదు.. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్.

410
Keerthy Suresh

ఆరోగ్యం కోసం కీర్తి సురేష్ యోగాను ఆశ్రయిస్తుంది. రోజువారీ యోగా చేస్తుంది. దీనివల్ల శరీరమే కాదు మనసూ ఆరోగ్యంగా ఉంటుందని చెబుతోంది. దీనివల్లే మనసు మంచి ఆలోచనలతో అందంగా తయారవుతుందని, చర్మం మెరుస్తూ ఉంటుందని అంటుంది. 

510

అందాల తారలు బ్యూటీ ప్రాడక్ట్స్ వాడకం అతి మామూలు విషయం. అవి వాడకపోతే తప్పదు. అయితే కీర్తీ సురేష్ మాత్రం రసాయన ఉత్సత్తుల కంటే సహజసిద్ధమైన నేచురల్ ప్రాడక్ట్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. 

610
Keerthy Suresh

మేకప్ వేసుకునేముందు ముఖానికి ఫౌండేషన్ రాసుకోవడం కీర్తి సురేష్ కు అస్సలు ఇష్టం ఉండదట. కారణం ఏంటంటే ఫౌండేషన్ చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. అందుకే దీనికి బదులు బిబి క్రీమ్ ను వాడుతుందట. 

710

మేకప్ ఎక్కువగా వేసుకోవడం కీర్తి సురేష్ కు అస్సలు ఇష్టం ఉండదట. సహజసౌందర్య రాశి అయిన ఆమె.. సింపుల్ మేకప్ నే ఇష్టపడుతుందట.. హెవీ మేకప్ కు చాలా దూరంగా ఉండడమే తన బ్యూటీ సీక్రెట్ అట..

810

మేకప్ ఎక్కువగా వేసుకోవడం కీర్తి సురేష్ కు అస్సలు ఇష్టం ఉండదట. సహజసౌందర్య రాశి అయిన ఆమె.. సింపుల్ మేకప్ నే ఇష్టపడుతుందట.. హెవీ మేకప్ కు చాలా దూరంగా ఉండడమే తన బ్యూటీ సీక్రెట్ అట..

910

ఇక రాత్రిపూట షూటింగ్ ఎంత ఆలస్యం అయినా సరే.. మేకప్ తీశాక కానీ నిద్రలోకి జారుకోదట. మేకప్ ను పూర్తిగా తొలగించాకే బెక్ మీదికి వెడుతుందట.

1010

అందమైన జుట్టుకోసం తరచూ కొబ్బరినూనెనే వాడుతుందట అందాలసుందరి కీర్తి సురేష్... దీంతోనే తన జుట్టుకు కావాల్సిన పోషకాలు లభిస్తాయని చెబుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories