Men's Health: పురుషులు పురుషాంగాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే ఈ సమస్యలు రావడం ఖాయం..

Published : May 12, 2022, 11:28 AM IST

Men's Health: స్త్రీలైన , పురుషులైనా తమ ప్రైవేట్ ఫార్ట్స్ ను శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక పురుషులు తమ పురుషాంగాన్ని క్లీన్ గా ఉంచుకోకపోతే వాపు, సంక్రమణ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని క్వాన్నా సహ వ్యవస్థాపకుడు డాక్టర్ సంజీవ్ కుమార్ హెచ్చరిస్తున్నారు. 

PREV
17
Men's Health: పురుషులు పురుషాంగాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే ఈ సమస్యలు రావడం ఖాయం..
penis

ప్రతిరోజూ స్నానం చేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. స్నానం చేయడం వల్ల ఒంటికి అంటుకున్న క్రిమికీటకాలు తొలగిపోతాయి. అయితే బిజీ లైఫ్ కారణంగా కొంతమందికి ప్రతిరోజూ స్నానం చేయడానికి వీలుండదు. అలాంటి వారు క్రమం తప్పకుండా తమ శరీర ప్రైవేట్ భాగాలను తప్పకుండా శుభ్రం చేసుకోవాలని పలు అధ్యయనాలు నొక్కి చెప్పాయి.  ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా లేకపోతే ఎన్నోసమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

27
penis

ప్రైవేట్ భాగాలను కేవలం ఆడవారే కాదు మగవారు కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

37
penis

అంటువ్యాధులు, ఇతర చర్మ వ్యాధులు రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పురుషులు తమ పురుషాంగాన్ని మంచిగా శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

47
PENIS

ప్రతిరోజూ పురుషాంగాన్ని శుభ్రపరుచుకోవాలని లేకపోతే అది అనేక ఇతర వ్యాధులకు దారితీస్తుందని క్వాన్నా సహ వ్యవస్థాపకుడు డాక్టర్ సంజీవ్ కుమార్ హెచ్చరిస్తున్నారు.  స్మెల్ లేని సబ్బుతో పురుషాంగాన్ని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. 
 

57
penis

ప్రైవేట్ భాగాలే ఎక్కువగా సంక్రమణకు గురవుతుంటాయి.  "పురుషాంగాన్ని పూర్తిగా శుభ్రపరచడం వల్ల వాపు మరియు సంక్రమణ అభివృద్ధి చెందే ప్రమాదం తగ్గుతుంది" అని క్వాన్నా సహ వ్యవస్థాపకుడు డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పారు. అలాగే దిమిత్రి లోక్తినోవ్ అన్నాడు.

67
penis

పురుషాంగంలో తేమ యొక్క స్థిరమైన ఉనికి సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. లో దుస్తులను తరచుగా మార్చకపోవడం వల్ల కూడా ఫంగస్ ప్రమాదం పెరుగుతుంది. పురుషాంగాన్ని శుభ్రం చేయడానికి కాటన్ క్లాత్ ను ఉపయోగించాలని చెబుతున్నారు. 

77

పురుషాంగాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల స్మెగ్మా వస్తుంది. స్మెగ్మా అనేది ఒక మందమైన, తెలుపుగా ఉండే దుర్వాసన వెదజల్లే పదార్థం. ఇది పురుషాంగం యొక్క ముందరి చర్మం కింద పేరుకుపోతుంది. స్మెగ్మా అనేది పురుషాంగం చుట్టూ కనిపించే సహజ లూబ్రికెంట్. కానీ ఇది పేరుకుపోయినప్పుడు ఇది సంక్రమణకు కారణమవుతుంది మరియు పై చర్మం యొక్క కదలికను తగ్గిస్తుందని డాక్టర్ దిమిత్రి చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories