Fact: వేళ్లని విరిస్తే 'టిక్‌' అనే శబ్ధం ఎందుకు వస్తుంది.? దీనివల్ల ఏమైనా సమస్య ఉంటుందా?

మనలో చాలా మందికి ఉండే అలవాట్లలో చేతి వేళ్లు విరవడం ఒకటి. టిక్‌ టిక్‌ మని వచ్చే శబ్ధం వినడానికి కూడా బాగుంటుంది. ఒత్తిడిలో ఉన్న మయంలో ఉపశమనం కలిగించేలా చేస్తుంది. ఇంతకీ వేళ్లను విరిస్తే శబ్ధం ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా.? 
 

Why Do Fingers Make a Popping Sound

మంచిది కాదని పెద్దలు ఎందుకు చెప్తారు.? 

చేతి వేళ్లను విరుస్తుంటే పెద్దలు మంచిది కాదని వారిస్తుంటారు. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు వేళ్లను విరచకూడదని అంటారు. దీనికి కారణం రాత్రుళ్లు చేతి వేళ్లను విరిస్తే లక్ష్మీదేవీకి కోపం వస్తుందని అంటారు ఇలా చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని చెబుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవకు ఇది కారణమవుతుందని పెద్దలు విశ్వసిస్తుంటారు. 

personality by finger shapes

ఇంతకీ శబ్ధం రావడం వెనకాల ఉన్న శాస్త్రీయ కారణం ఏంటంటే.? 

మన శరీరంలోని ప్రతి కీళ్లలో రెండు ఎముకల మధ్య "సైనోవియల్ జాయింట్" అనే భాగం ఉంటుంది. ఈ భాగంలో సైనోవియల్ ఫ్లూయిడ్ (Synovial Fluid) అనే జెల్‌లాంటి ద్రవం ఉంటుంది. వేళ్లు సాఫీగా కదిలేలా చేసేందుకు ఈ ఫ్లూయిడ్‌ పనిచేస్తుంది. ఈ సైనోవియల్ ద్రవంలో కార్బన్ డై ఆక్సైడ్ (CO₂), నైట్రోజన్ (N₂), ఆక్సిజన్ (O₂) వంటి వాయువులు ఉంటాయి. 

రెండు ఎముకల మధ్య ఉండే ఖాళీ తక్షణమే విస్తరిస్తుంది. ద్రవంలో ఉన్న వాయువులు ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. అప్పట్లో ఒక గాలి బుడగ (gas bubble) పగిలిపోతుంది. ఈ బుడగ పగిలినప్పుడు వినిపించే శబ్దమే మనం వింటున్న "టిక్‌ టిక్‌' శబ్ధం. 


fingers

వెంటనే మరోసారి శబ్ధం ఎందుకు రాదో తెలుసా.? 

ఒకసారి చేతి వేళ్లను విరిచిన తర్వాత మరోసారి శబ్ధం రావడానికి కనీసం 15–30 నిమిషాల సమయం పడుతుంది. దీనికి కారణం గాలి బుడగ మళ్లీ తయారుకావడానికి పట్టే సమయమే. ఫ్లూయిడ్ లో వాయువు మళ్లీ కలిసి నిల్వ ఉండడానికి సమయం పడుతుంది. 

ఏమైనా సమస్యలు ఉంటాయా.? 

చేతి వేళ్లను విరవడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఎక్కువసార్లు, అదే పనిగా బలంగా వేళ్లను విరుస్తుంటే.. కీళ్లను కలిపే లిగామెంట్స్‌ నెమ్మదిగా బలహీనపడే అవకాశం ఉంటుంది. కాస్త వాపు, అసౌకర్యం ఉండొచ్చు. అయితే ఆర్థరైటిస్‌ సమస్యలు వస్తాయన్న దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పాలి. 
 

Latest Videos

click me!