Parenting tips: పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలి వేళ్లేముందూ ఇవి తప్పకుండా చేయండి!

Parenting tips: ముఖ్యమైన పనుల వల్ల తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో పిల్లలను ఎలా ప్రిపేర్ చేయాలి? ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పేరెంట్స్ బయటకు వెళ్లాలో ఇక్కడ తెలుసుకుందాం. 

ఒక్కోసారి తల్లిదండ్రులు ఉన్నట్టుండి ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి రావొచ్చు. ముఖ్యమైన పనుల వల్ల ఎక్కువసేపు పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లాల్సి రావచ్చు. అప్పుడు పేరెంట్స్ పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంటరిగా ఉండడానికి వారిని ఎలా ప్రిపేర్ చేయాలి. నిపుణులు ఏం చెబుతున్నారో మీకోసం.

పిల్లలు బాధ్యతగా ఉంటారు

పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టడం తల్లిదండ్రులకు కాస్త కష్టమైన పనే. అయినప్పటికీ వారిని ఒంటరిగా ఉండటానికి అలవాటు చేస్తే పిల్లలు మరింత స్వతంత్రంగా, బాధ్యతగ ఆత్మవిశ్వాసంతో ఉంటారని నిపుణులు చెబుతున్నారు.


ఎమర్జెన్సీ నంబర్

పిల్లల ఫోన్‌లో కుటుంబ సభ్యుల నంబర్లు ఉన్నప్పటికీ, 2 లేదా 3 ఎమర్జెన్సీ నంబర్లు గుర్తు పెట్టుకునేలా చూడండి. అందులో తల్లిదండ్రుల నంబర్లు, దగ్గరి బంధువుల నంబర్లు, నమ్మకమైన పొరుగు వారి నంబర్లు ఉండాలి.

స్క్రీన్ టైమ్

మీరు లేనప్పుడు పిల్లలు టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం లేదా ఇంటర్నెట్  వాడటంలోనే సమయం గడిపేస్తారు. స్క్రీన్ టైమ్  గురించి కాస్త కఠినంగా ఉండండి. ఆ నియమాలు ఎందుకు ముఖ్యమో పిల్లలకు వివరించండి.

సేఫ్టీ తప్పనిసరి

పిల్లలు ఇంట్లో ఒంటరిగా సురక్షితంగా ఉండాలంటే వారికి కొన్ని విషయాలు తప్పకుండా నేర్పించాలి. గ్యాస్ ఆన్, ఆఫ్ చేయడం పిల్లలకు నేర్పించండి. మీరు ఇంట్లో లేనప్పుడు చాకు వాడకూడదని చెప్పండి. పదునైన వస్తువులు పిల్లలకు అందకుండా పెట్టండి.

ఫుడ్ ప్రిపేర్ చేయడం

పిల్లల కోసం ఇంట్లో స్నాక్స్ లేదా తినడానికి ఏదైనా చేసి పెట్టడం మర్చిపోకండి. మీరు ఇంట్లో లేనప్పుడు పిల్లలు ఎలాంటి వంటలు చేయకూడదని చెప్పండి. పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు గ్యాస్ ఆన్ చేయడం ప్రమాదకరం కావచ్చు.

డోర్ తెరవద్దు

ఎవరైనా తలుపు తట్టినప్పుడు తెరవాలో వద్దో అనేది ముఖ్యం. బయట ఎవరున్నారో తెలిసే వరకు తలుపు తెరవొద్దని పిల్లలకు నేర్పించండి. అపరిచితులను లోపలికి రానివ్వకూడదు. తెలిసిన వాళ్లెవరైనా వచ్చినా ముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసి అడగాలని చెప్పండి.

Latest Videos

click me!