ఎక్కడైనా చూడండి... కదులుతున్న బైకులు, సైకిళ్ల వెంట వీధి కుక్కలు అరుస్తూ పరిగెత్తుతూ ఉంటాయి. కొన్నిసార్లు అవి వేగంగా పరుగెత్తితే... మరికొన్నిసార్లు నెమ్మదిగా పరుగెడతాయి. వాటి వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అసలు ఎందుకు ఇలా పరిగెడతాయో తెలుసా?
అంతవరకు రోడ్డుపై నిశ్శబ్దంగా కూర్చున్న కుక్కలు అకస్మాత్తుగా లేస్తాయి. ఆ వైపుగా వెళుతున్న బైకులు, కార్లు, సైకిల్ వెంబడి ఒకేసారి పరిగెత్తడం ప్రారంభిస్తాయి. పరిగెత్తడమే కాదు గట్టిగా అరుస్తూ హడావిడి చేస్తాయి. ఇలాంటి దృశ్యాలు మీరు ఇప్పటివరకే ఎన్నోసార్లు చూసుంటారు. అసలు కుక్కలు ఇలా బైకులు, కార్లు వెంబడి అలా ఎందుకు పరిగెడతాయి... అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది.
25
వాసన పోల్చి
కుక్కలకు మనుషులతో పోలిస్తే వాసనను గ్రహించే శక్తి చాలా ఎక్కువ. అవి దూరం నుండే వాసనను పసిగట్టగలవు. మీ కార్లు లేదా బైకులు, సైకిల్ వంటివి వేరే ప్రదేశం నుండి కుక్కలు ఉన్న ప్రాంతానికి వస్తాయి. అప్పుడు కుక్కలకు ఆ కారు వేరే ప్రదేశం నుంచి వచ్చిందన్న విషయం ఆ టైర్ల నుంచి వచ్చే వాసన ద్వారా గుర్తిస్తాయి. అక్కడ నివసించే కుక్కలకు ఆ భూభాగంలో వచ్చే వాసన అలవాటైపోతుంది.
ఎప్పుడైతే వేరే ప్రదేశం నుంచి కారు లేదా బైకు వస్తుందో దాని వాసన భిన్నంగా ఉంటుంది. ఆ వాసనను కుక్కలు గ్రహించి వెంటనే హెచ్చరికలాగా అరవడం మొదలుపెడతాయి. నిజానికి కుక్కలు ఉండే ప్రాంతాలలో కాపలా కాస్తాయి. తమ సరిహద్దును తామే నిర్ణయించుకుంటాయి. ఆ సరిహద్దులోపలికి ఏవైనా కొత్త బైకులు, కార్లు వంటివి వస్తే వెంటనే అరవడం మొదలుపెడతాయి.
35
టైర్లపై మూత్రవిసర్జన
ఎక్కడైనా కూడా వాహనాల టైర్లపై కుక్కలు మూత్ర విసర్జన చేయడం చూసి ఉంటారు. ఇది వాటికున్న అలవాటు అనుకుంటారు. నిజానికి అవి తమ ఉనికికి గుర్తుగా టైర్లపై అలా మూత్ర విసర్జన చేస్తాయి. ఆ వాసనను అవి పసిగడతాయి. ఆ కారు తమ ప్రాంతంలోనే తిరుగుతున్నప్పుడు అవి స్థానికమైన కార్లుగా అవి పసిగట్టి అరవడం వంటివి చేయవు. అదే బయట నుంచి కారు వస్తే మాత్రం వెంటనే అరవడం మొదలు పెడుతుంది.
45
ప్రమాదాలు జరిగినా
కొన్నిసార్లు ఇది కేవలం వాసనకు సంబంధించిన విషయమే కాకపోవచ్చు. కుక్కలు చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటాయి. ఒక వాహనం వల్ల తమ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో గాయపడినా, మరణించిన అవి ఆ వాహనాన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటాయి. అలాంటి వాహనాన్ని మరొకసారి చూసినప్పుడు వెంటనే స్పందిస్తాయి. వాటి ఆ కార్లు వెంట పరిగెట్టడం కోపంగా రావడం వంటివి చేస్తాయి.
కుక్కలు సాధారణంగా కదులు కదులుతున్న వాహనాలపైనే దృష్టి సారిస్తాయి. స్థిరంగా ఒక చుట్టూ ఉన్న వాహనాలను పెద్దగా పట్టించుకోవు. అందుకే ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు అవి పట్టించుకోవు. కానీ బైకు లేదా కారు శబ్దం వస్తే మాత్రం వెంటనే అప్రమత్తమవుతాయి.
55
కుక్క వెంటపడితే ఇలా చేయండి
కార్ వెంట కుక్కలు పడినా కూడా పెద్దగా ప్రమాదం లేదు. కానీ బైకులు, సైకిల్ వెంట పడితే మాత్రం వాటివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. బ్యాలెన్స్ కోల్పోవచ్చు. కాబట్టి కుక్కలు మీ వెంటపడుతున్నట్టు అనిపిస్తే వేగాన్ని పెంచకండి. నెమ్మదిగా మీ వాహనాన్ని ఆపి కదలకుండా కుక్కల వైపు చూడకుండా కొన్ని సెకండ్ల పాటు అలా ఉండిపోండి. మీరు కుక్కల్ని రెచ్చగొడితేనే అవి మీపైన దాడి చేస్తాయి. మీరు కదలకుండా నిశ్శబ్దంగా ఉండిపోతే అవి మిమ్మల్ని కాసేపటికి వదిలేస్తాయి.