నటి తమన్నా తన స్కిన్ కేర్ గురించి అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో చెబుతుంది. ఒక ఇంటర్వ్యూలో మొటిమలు నయం చేయడానికి ఒక అద్భుతమైన రెసిపీని చెప్పింది. ఇది తన చర్మ సంరక్షణలో భాగంగా పాటించేదాన్ని కూడా వివరించింది.
తెలుగు సినిమా పరిశ్రమలలో పెద్ద హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. కేవలం తెలుగులోనే కాదు.. హిందీ, తమిళంలో కూడా ఆమె ఎన్నో సినిమాలను చేసింది. ఆమె డాన్సుకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పాల నురగ లాంటి అందమైన ఆమె తన చర్మ సంరక్షణ చిట్కాలను అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా తమన్నా మొటిమలు త్వరగా నయం అయ్యేందుకు ఒక దేశీ నివారణను చెప్పింది. ఈ దేశీ చిట్కా వింటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.
25
మొటిమలపై లాలాజలం
తమన్నాకు కూడా అప్పుడప్పుడు మొటిమలు వచ్చే సమస్య ఉంది. అందుకే ఉదయం లేచిన తర్వాత ఆమె తన నోటిలోంచి లాలాజలాన్ని తీసి ఆ మొటిమలపై పూసుకుంటానని చెప్పింది. ఇది వినేందుకు కాస్త వింతగా అసహ్యంగా అనిపించవచ్చు కానీ ఈ నివారణ అద్భుతంగా పనిచేస్తుందని చెబుతోంది తమన్నా.
ఉదయం పూట వచ్చే లాలాజలంలో మొటిమలను ఎండిపోయేలా చేసే ఎంజైమ్ లు ఉంటాయని... అందుకే అవి త్వరగా తగ్గిపోతాయని వివరిస్తుంది తమన్నా. అయితే ఈ చిట్కాను ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు. తమన్నా మాత్రం ఉదయం పూట లేచాక ఆ లాలాజలాన్ని మొటిమలకు అప్లై చేయడం వల్ల అవి నయం అవుతాయని చెబుతోంది.
35
యాంటీ ఏజింగ్ స్కిన్ క్రీములు
అలాగే తన చర్మ సంరక్షణ చిట్కాలను మరెన్నో పంచుకుంది. మెరిసే చర్మం కోసం ఆమె యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ కూడా ఉపయోగిస్తున్నట్టు వివరించింది. పాతికేళ్ల తర్వాత చర్మ సమస్యలు రావడం మొదలవుతాయి. అందుకే యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ వాడుతున్నట్టు వివరించింది. ఈ యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ వల్ల ముఖంపై గీతలు, ముడతలు వంటివి రాకుండా ఉంటాయి.
45
క్రీములే కాదు ఆహారం కూడా
చర్మం అందంగా మెరవాలంటే కేవలం క్రీములు పూస్తే సరిపోదు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని కూడా తినాలి. చర్మం అనేది మీరు అంతర్గతంగా ఉన్న ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి మంచి చర్మం కావాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని చెబుతోంది తమన్నా. అలాగే ఆహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గించుకోవాలని, తగినంత నిద్రపోవాలని వివరిస్తుంది.
55
బాగా నిద్రపోవాలి
నిద్ర లేకపోవడం వల్ల అలాగే అధిక ఒత్తిడి వల్ల కూడా చర్మం వాడిపోయినట్టు అవుతుందని, అలాగే ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయని చెబుతోంది. ప్రతిరోజు కనీసం ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోవాలని వివరిస్తోంది. ధ్యానం, లోతైన శ్వాస, వ్యాయామాలు చేయడం వల్లఒత్తిడి తగ్గించుకోవచ్చు అని కూడా చెబుతోంది తమన్నా. ఈ బ్యూటీ హ్యాక్ మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. కాకపోతే కొందరికి అది కాస్త విచిత్రంగా అసహ్యంగా అనిపించవచ్చు.