ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లతో ఈ వ్యాధిని దూరం పెట్టవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
గజిబిజి లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. షుగర్ వ్యాధి.. సైలెంట్ గా వ్యక్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కళ్లు, కిడ్నీ, గుండె ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యాధి వచ్చిన తర్వాత బాధపడేకన్నా.. ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
26
నిద్ర లేమి
శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోతే.. రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేమి వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
36
వ్యాయామం
ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆక్టీవ్ గా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. తగినంత వ్యాయామం లేకపోయినా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం మర్చిపోవద్దు.
ఒత్తిడి చాలా సమస్యలను తెస్తుంది. ఎప్పుడూ ఒత్తిడికి గురయ్యే వ్యక్తికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది ఇన్సులిన్‌ను నిరోధించి గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం వాకింగ్, యోగా, ధ్యానం వంటివి చేయవచ్చు.
56
పేగు ఆరోగ్యం
ఇన్సులిన్ సెన్సిటివిటీలో గట్ మైక్రోబయోమ్ కీలక పాత్ర పోషిస్తుంది. సరైన మోతాదులో ఆహారం తీసుకున్నప్పుడు, పేగు బ్యాక్టీరియా దాన్ని విచ్ఛిన్నం చేసి బ్యూటిరేట్ వంటి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్‌లుగా మారుస్తుంది. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
66
భోజన సమయం
సమయానుసారం.. తగిన మోతాదులో ఆహారం తీసుకోవాలి. రెండు గంటలకోసారి తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నివారించవచ్చు. కాబట్టి కచ్చితమైన సమయాల్లో ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.