Child Psychology: పిల్లల ముందు భర్త... భార్యను తిడితే ఏమౌతుంది?

Published : Feb 02, 2026, 02:52 PM IST

Child Psychology: చాలా మంది భర్తలు.. తమ భార్యను చాలా చులకన చేసి మాట్లాడతారు. భార్య కు ఏమీ తెలీదన్నట్లు మాట్లాడతారు. ఆ మాటలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసా? 

PREV
14
Child Psychology

చాలా ఇళ్లల్లో భర్త మాత్రమే సంపాదిస్తూ ఉంటాడు.దీంతో... తామే సంపాదిస్తున్నామనే గర్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ అధికారాన్ని భార్యపై చూపిస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలు ఉన్నారు.. వారి ముందు ఏమాట పడితే ఆ మాట అనకూడదు అని తెలీకుండా మాట్లాడతారు. పిల్లల ముందు తండ్రి తల్లిని తక్కువ చేసి మాట్లాడటం లేదా విమర్శించడం అనేది కేవలం ఆ క్షణానికి సంబంధించిన గొడవ కాదు.. ఇది పిల్లల మనసుపై, వారి వ్యక్తిత్వంపై జీవితాంతం చెరగని ముద్ర వేస్తుంది. దీనినే Indirect psychological Abuse అని అంటారు.

24
పిల్లల ముందు తల్లిని తిట్టడం వల్ల కలిగితే ఏమౌతుందో చూద్దాం...

1. పిల్లల్లో భద్రతా భావం (Security) దెబ్బతింటుంది...

పిల్లలకు వారి తల్లిదండ్రులే ప్రపంచం. ఆ ప్రపంచంలోని ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గౌరవించుకోకపోతే, తమకు రక్షణ లేదనే భయం పిల్లల్లో మొదలౌతుంది. ఇది వారిని మానసిక ఆందోళనకు (Anxiety) గురి చేస్తుంది.

2.తల్లిపై గౌరవం పోతుంది.. ( Loss of Authority)

‘నీకు పిల్లల్ని పెంచడం రాదు’ అని తండ్రి అన్నప్పుడు.. పిల్లల మనసులో ‘ మా అమ్మకు ఏమీ తెలియదు, ఆమె మాట వినక్కర్లేదు’ అనే భావన నాటుకుపోతుంది. దీని వల్ల.. పిల్లలు తల్లి మాట వినడం మానేస్తారు. తల్లి క్రమశిక్షణలో పెట్టాలని చూసినప్పుడు ఎదురు తిరుగుతారు. ఇంట్లో తల్లి పాత్ర బలహీనపడి, కుటుంబ వ్యవస్థ అస్తవ్యవస్థమౌతుంది.

34
3.తప్పుడు రోల్ మోడలింగ్ ( Whole Role Modeling)

పిల్లలు మాటల కంటే తల్లిదండ్రుల ప్రవర్తనను చూసి ఎక్కువగా నేర్చుకుంటారు.

మఖ్యంగా మగ పిల్లలు అయితే... ఆడ వారిని గౌరించాల్సిన అవసరం లేదని, తక్కువ చేసి మాట్లాడటం, ‘మగతనం’ అని తప్పుగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో వారు కూడా తమ భార్యలతో ఇలాగే ప్రవర్తించే ప్రమాదం ఉంది.

ఆడపిల్లలు: పురుషులు ఇలాగే ప్రవర్తిస్తారని, అది సహజమని భావించి, భవిష్యత్తులో తమపై జరిగే అన్యాయాన్ని మౌనంగా భరించే అవకాశం ఉంటుంది.

4. భావోద్వేగ సంఘర్షణ (Triangulation)

తండ్రి తల్లిని తిట్టినప్పుడు పిల్లలు ఎవరి వైపు ఉండాలో తెలియక సతమతమవుతారు. తల్లిని ప్రేమిస్తారు కాబట్టి ఆమె పడే బాధను చూసి తండ్రిపై కోపం పెంచుకుంటారు. అదే సమయంలో తండ్రి అంటే భయం లేదా ప్రేమ ఉండటం వల్ల తీవ్రమైన 'మానసిక సంఘర్షణ' అనుభవిస్తారు. ఇది వారి ఎదుగుదలను దెబ్బతీస్తుంది.

5. ఆత్మవిశ్వాసం తగ్గడం (Low Self-Esteem)

తల్లిని తక్కువ చేసి మాట్లాడటం అంటే.. ఆ పిల్లల మూలాలను విమర్శించడమే. "నీకు ఏమీ రాదు" అనే మాటలు విన్న పిల్లలు, తమలో కూడా లోపాలు ఉన్నాయని, తాము దేనికీ పనికిరామని లోలోపల కుంగిపోతారు.

44
నిపుణులు (Psychologists) ఏం చెబుతున్నారు?

"తండ్రి తన పిల్లలకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఏదైనా ఉందంటే.. అది వారి తల్లిని గౌరవించడం."

గౌరవప్రదమైన విభేదం: దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. కానీ వాటిని గది తలుపులు మూసి చర్చించుకోవాలి. పిల్లల ముందు ఎప్పుడూ ఒకరికొకరు మద్దతుగా (United Front) ఉండాలి.

Parental Alienation: ఒక పేరెంట్ మరొక పేరెంట్‌ను తక్కువ చేయడం వల్ల పిల్లలు ఆ పేరెంట్‌కు దూరం అవుతారు. ఇది లాంగ్ టర్మ్‌లో పిల్లల్లో డిప్రెషన్‌కు దారితీస్తుంది.

ఏకాగ్రత లోపం: ఇంట్లో ఎప్పుడూ గొడవలు, విమర్శలు వినే పిల్లలు చదువుపై ఏకాగ్రత చూపలేరు. వారి మెదడు ఎప్పుడూ 'ఫైట్ ఆర్ ఫ్లైట్' (భయం) మోడ్‌లో ఉంటుంది.

మీకు పిల్లల పెంపకంలో భార్యతో విభేదాలు ఉంటే, వాటిని ఒంటరిగా ఉన్నప్పుడు చర్చించండి. "నీ పద్ధతి నాకు నచ్చలేదు, మనం ఇలా చేస్తే బాగుంటుందేమో ఆలోచించు" అని సున్నితంగా చెప్పడం వేరు, పిల్లల ముందు "నీకు చేతకాదు" అని అవమానించడం వేరు.

Read more Photos on
click me!

Recommended Stories