ఇండియన్స్ కీ బంగారానికి విడదీయరాని సంబంధం ఉందని చెప్పొచ్చు. ఇంట్లో ఏదైనా శుభకార్యం, పండగలు, పెళ్లిళ్లు.. ఏది ఉన్నా.. బంగారం కొనాలని అనుకుంటారు. ఇక.. ఏదైనా ఫంక్షన్ కి వెళితే.. భారీగా నగలు ధరించి అందరికంటే అందంగా కనిపించాలనే కోరిక స్త్రీలకు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే.. బంగారం ధరతో సంబంధం లేకుండా నగలు కొనేవారు కొందరు అయితే.. పెరుగుతున్న రేటుకు బంగారం కొనలేకపోతున్నాం అని ఫీలయ్యేవారు చాలా మంది ఉన్నారు.
అంతేకాదు, బంగారం ధర కి తోడు నగలు కొనుగోలు చేసినప్పుడు.. తరుగు, మజూరీ, మేకింగ్ ఛార్జీలు అంటూ మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు మీరు రూ. పది లక్షలకు ఖర్చు చేసి నగలు కొంటే, అందులో దాదాపు రూ.2లక్షలు కేవలం తరుగు, మజూరీ కింద పోతాయి. అంటే. మీరు షాపు నుండి బయటకు అడుగు పెట్టగానే మీ 10 లక్షల విలువ రూ.8 లక్షలకు పడిపోతుంది. అలా జరగకుండా ఉండేందుకు ఒక చిన్న హైబ్రిడ్ ఐడియా ఫాలో అయితే సరిపోతుంది.