Idli Batter: మల్లెపువ్వులా మెత్తటి, తెల్లగా ఉండే ఇడ్లీలను అందరూ ఇష్టంగా తింటారు. అలాంటి ఇడ్లీలు తయారు చేయాలంటే ముందుగా సరైన కొలతలతో ఇడ్లీ పిండి తయారుచేసుకోవాలి.
ఇడ్లీ ప్రతి ఇంట్లో ఉండే బ్రేక్ ఫాస్ట్. ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేనప్పుడు కచ్చితంగా ఇడ్లీని కచ్చితంగా తింటారు. అయితే ఇడ్లీ మెత్తగా ఉంటేనే తినాలనిపిస్తుంది. అయితే ఇడ్లీ మెత్తగా రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వంట చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా ఇడ్లీ రుచిని పాడు చేస్తాయి. ఇడ్లీ మల్లెపువ్వులాంటి మెత్తగా ఇడ్లీ రావడానికి కొన్ని పద్దతులు పాటించాలి.
24
ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ బియ్యం లేదా సన్న బియ్యం - నాలుగు గ్లాసులు
మినప గుళ్ళు - ఒక గ్లాసు
అటుకులు - అర గ్లాసు
సగ్గుబియ్యం - అర గ్లాసు
మెంతులు - ఒక చెంచా
ఉప్పు - రుచికి సరిపడా
34
తయారు చేసే విధానం
ముందుగా బియ్యం, మినపప్పు, మెంతులను వేర్వేరుగా కడిగి నానబెట్టాలి. ఇడ్లీ పిండి రుబ్బడానికి అరగంట ముందు అటుకులను కడిగి నానబెట్టుకోవాలి. ముందుగా మినపప్పును మిక్సీలో రుబ్బుకోవాలి. చల్లటి నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత బియ్యం, సగ్గుబియ్యం, నానబెట్టిన అటుకులను కొద్దిగా బరకగా రుబ్బుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి.
ఇడ్లీ పిండిని కనీసం 8 నుంచి 10 గంటలు పాటూ పులియబెట్టాలి. మరుసటి రోజుకి పిండి ఉబ్బుతుంది. ఇడ్లీ వండే ముందు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి పిండిని అందులో వేసుకోవాలి. తరువాత పావుగంట పాటూ ఉడికించుకోవాలి. ఇందులో మంచి మినపప్పును వాడాలి. రుబ్బేటప్పుడు ఎక్కువ నీళ్లు పోయొద్దు. పిండి గట్టిగా ఉంటే ఇడ్లీలు బాగా వస్తాయి. వేడివేడి ఇడ్లీలను కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో తినండి. ఇడ్లీలు మెత్తగా రావాలనుకుంటే వంట సోడా కలుపుకోవాలి.